Happy Ugadi Wishes 2025: ఉగాదికి స్నేహితులకు బంధువులకు ఇలా అందంగా శుభాకాంక్షలు చెప్పండి, ఇదిగో అందమైన సందేశాలు

Happy Ugadi Wishes 2025: ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరం. భారతదేశంలోని ప్రజలు ఉగాదిని వైభవంగా నిర్వహించుకుంటారు. ఈ ఉగాదికి మిత్రులకు, బంధువులకు శుభాకాంక్షలు, సందేశాలు పంపుకుంటారు.

Published on: Mar 30, 2025 5:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉగాదికి శుభాకాంక్షలు చెప్పాకే పండగ మొదలవుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో వచ్చే మొదటి పండుగ ఉగాది. దీన్నే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. మహారాష్ట్రలో గుడిపడ్వా అని అంటారు. ఇక తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలో ఉగాది అని అంటారు.

ఉగాది శుభాకాంక్షలు
ఉగాది శుభాకాంక్షలు

ఉగాది అనే పదం సంస్కృత పదం నుండి ఉద్భవించిందని చెప్పుకుంటారు. విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడు ఉగాది రోజే విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. అందుకే ఉగాదిని నిర్వహించుకుంటామని అంటారు. ఈరోజు వ్యాపారాలు ప్రారంభించే వారి సంఖ్య ఎక్కువే. ఉగాది రోజు బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పుకోవడం ద్వారా పండుగను నిర్వహించుకోవడం మొదలుపెడతారు. మీరు కూడా చక్కటి శుభాకాంక్షలు కోసం వెతుకుతున్న వారైతే ఇక్కడ మేము ఉగాది విషెస్ ను, అందమైన సందేశాలుగా, కోట్స్ గా ఇచ్చాము. వాట్సాప్‌లో, సోషల్ మీడియాలో, మెసేజుల రూపంలో వీటిని పంపుకోవచ్చు.

ఉగాది శుభాకాంక్షలు తెలుగులో

1. ఈ ఉగాది పండుగ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను

మరింత దగ్గర చేసే మీ హృదయాలను ఆనందంతో

నింపాలని కోరుకుంటున్నాను

మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

2. కొత్త ప్రారంభాలు,

కొత్త అవకాశాలు

కొత్త ఆశీర్వాదాలతో నిండిన

ఉగాది పండుగ శుభాకాంక్షలు అందుకోండి

3. ఈ ఉగాది మీకు ఆనందాన్ని

విజయాన్ని, శ్రేయస్సును అందించాలని

అద్భుతమైన ప్రయాణానికి నాంది పలకాలని కోరుకుంటూ

మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

4. ఈ తెలుగు నూతన సంవత్సరం

మీకు మీ కుటుంబానికి ఆనందకరమైన

ప్రయాణంగా మారాలని కోరుకుంటున్నాను

మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

5. కృతజ్ఞతతో, కొత్త ఆశలతో

ఈ ఉగాది సంవత్సరాన్ని ప్రారంభించండి

విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

6. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో

మీ ప్రయాణంలో చీకటి అంతా తొలగిపోయి

మీకు విజయం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

మీకు ఉగాది శుభాకాంక్షలు

7. ఈ ఉగాది శుభ సందర్భంగా

మీ కలలు వికసించాలి

మీ లక్ష్యాలను చేరుకోవాలి

మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు

8. ఈ శుభ ఉగాది సందర్భంగా

మీ జీవితం నవ్వులతో, ప్రేమతో, కొత్త ఆరంభాలతో

నిండిపోవాలని కోరుకుంటున్నాను

మీకు మీ కుటుంబ సభ్యులకు

విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

9. గతాన్ని వదిలేసి

ఈ కొత్త ఏడాదిలో అంతులేని అవకాశాలు

మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

10. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి

ఈ సంవత్సరం అంతా మీకు

అత్యంత విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను

మీకు విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు

11. కొత్త ఏడాది, కొత్త రోజు, కొత్త ఉదయం

సరికొత్తగా ప్రారంభిద్దాం.

ఈ ఉగాది పండుగకు అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుందాం

విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు

12. మీ కన్నా చిన్నవారిని ప్రేమించండి

మీ కన్నా పెద్దలను గౌరవించండి

ఇదే సంకల్పంతో ఈ ఉగాది పండుగను నిర్వహించుకోండి

విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

13. నూతన సంవత్సరపు కొత్త ఉదయం

ఆనందాన్ని తేవాలని

మీ మనసులోని చీకటి అంతా తొలగిపోయి

ప్రతిక్షణం ప్రకాశవంతం అవ్వాలని కోరుకుంటూ

మీకు విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు

14. పాత సంవత్సరం మిగిల్చిన బాధలు దుఃఖాలు తొలగిపోవాలి

కొత్త సంవత్సరం కొత్త ఆశలతో, కొత్త శక్తిని తీసుకురావాలి

మీకు మీ కుటుంబ సభ్యులకు

విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు

15. హృదయంలో కొత్త ఉత్సాహం

కళ్ళల్లో కొత్త ఆనందం

మనసులో కొత్త విశ్వాసం

మీకు ఈ ఉగాది నుంచి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా.

16. హిందూ నూతన సంవత్సరానికి హృదయపూర్వక శుభాకాంక్షలు

మీరు మీ కుటుంబం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో విజయాలు అందుకోవాలి.

17. విశ్వావసు నామ సంవత్సరం

మీకు సుఖం, శాంతి, సంపదలను తీసుకురావాలని

మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

ఉగాది శుభాకాంక్షలు

18. ఉగాది పచ్చడిలో బెల్లం, వేప ఉన్నట్టే

ప్రతి ఒక్కరి జీవితంలో తీపి, చేదు రెండూ ఉంటాయి.

కానీ మీ జీవితంలో చేదు కంటే తీపే ఎక్కువ ఉండాలని

మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు

19. నూతన సంవత్సరం మీకు నూతన ఉత్సాహాన్ని ఇవ్వాలి

ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మీ కలలు నెరవేరాలి

మీకు బలాన్ని, సామర్థ్యాన్ని ఇచ్చి మీరు అనుకున్నది సాధించాలి

మీకు ఉగాది శుభాకాంక్షలు

20. ఈ విశ్వావసు నామ సంవత్సరాన్ని స్వాగతిద్దాం.

ఈ నూతన సంవత్సర మీకు ఆనందం, శాంతి,

శ్రేయస్సు ఇవ్వాలని కోరుకుంటున్నాను

ఈ ఏడాదంతా మీకు ఆనందంతో నిండిపోవాలని ఆశిస్తున్నాను.

మీకు ఉగాది శుభాకాంక్షలు

21. మీ శత్రువుల పట్ల ద్వేషాన్ని విడిచిపెట్టండి

మీ చుట్టూ ఉన్న చీకటిని వెలుగుగా మార్చుకోండి

ఈ ఉగాది మీ కుటుంబం కోసం ఆనందం, శాంతి,

ప్రశాంతత తీసుకురావాలని కోరుకుంటూ

శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు