ఏపీ అగ్రిసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల - ఇవాళ్టి నుంచే రిజిస్ట్రేషన్లు, ముఖ్య తేదీలివే
ఏపీ అగ్రిసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హులైన అభ్యర్థులు జూలై 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 18వ తేదీన ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులలో 2025- 26 ప్రవేశాలకు ఏపీ అగ్రిసెట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా నేటి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు…జూలై 26వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. www.angrau.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

ఏపీ అగ్రిసెట్ - 2025 నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు
- ఎంట్రెన్స్ పరీక్ష - ఏపీ అగ్రిసెట్ - 2025
- అర్హతలు - రెండేళ్ల డిప్లోమా(అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, ఆర్గానికి ఫార్మింగ్) పూర్తి చేసి ఉండాలి.
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - 11 జూలై 2025
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ - 26 జూలై 2025
- దరఖాస్తు ఫీజు - ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ. 1500, ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 750
- పోస్ట్ ద్వారా హార్డ్ కాపీ సమర్పించే తేదీ - 5 ఆగస్టు 2025 లోపు (ది కన్వీనర్, AGRICET-2025, O/o ది ప్రొఫెసర్ అండ్ హెడ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎంటమాలజీ, అగ్రికల్చర్ కాలేజీ, బాపట్ల -522 101, ఆంధ్రప్రదేశ్)
- ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన అప్లికేషన్ హర్డ్ కాపీ, పుట్టిన తేదీ సర్టిఫికేట్, ఎస్ఎస్‌సీ సర్టిఫికేట్, డిప్లొమా మార్కుల జాబితా, కండక్ట్ సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రం. ఏడేళ్ల లోక్ సర్టిఫికేట్ (స్టడీ ఆర్ రెసిడెన్సీ), పీహెచ్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, సీఏపీ, ఒక పాస్‌పోర్టు సైజ్ పోటో, అప్లికేషన్ ఫీజు పేమెంట్ రిసిప్ట్‌లు స్పీడ్ పోస్టుకు జత చేయాలి.
- అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఫీజును అధికారిక వెబ్‌సైట్ angrau.ac.in లో ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.
- ఫైన్ తో దరఖాస్తు చేయాలనుకునే జనరల్ కేటగిరీ, బీసీ అభ్యర్థులు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు జూలై 27 నుంచి 29 వరకు గడువు ఉంటుంది.
- హాల్ టికెట్లు విడుదల - 14 ఆగస్టు 2025
- పరీక్ష నిర్వహణ - 18 ఆగస్టు 2025(సోమవారం)
- మొత్తం 120 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. గంటన్నర సమయం. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు.
- అధికారిక వెబ్ సైట్ - https://angrauagricet
ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ అగ్రిసెట్ - 2025కు దరఖాస్తు చేసుకోవచ్చు
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper












