ఏపీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్ - ఫైనల్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

ఏపీ కానిస్టేబుల్‌ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు https://slprb.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మొత్తం 33,921 మంది అర్హత సాధించారు.

Published on: Jul 11, 2025 12:09 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ కానిస్టేబుల్‌ నియామకాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. తుది రాత పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 37,600 మంది హాజరుకాగా….. 33,921 మంది అర్హత సాధించారు. ఈ ఫలితాలను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

ఏపీ కానిస్టేబుల్‌ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల
ఏపీ కానిస్టేబుల్‌ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల

రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

  • కానిస్టేబుల్ నియామక పరీక్షలు రాసిన అభ్యర్థులు https://slprb.ap.gov.in/UI/index వెబ్ సైట్ లోకి వెళ్లండి
  • హోం పేజీలోని రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడ అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ చేస్తే రిజల్ట్ డిస్ ప్లే అవుతుంది.

మరోవైపు అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను కూడా అందుబాటులో ఉంచారు. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై 11 నుంచి 17 వరకు తెలపవచ్చని అధికారులు ప్రకటించారు.

ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ ప్రాసెస్ ఇలా…

  1. అభ్యర్థులు https://slprb.ap.gov.in/UI/index వెబ్ సైట్ లోకి వెళ్లండి
  2. హోం పేజీలోని ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  3. ఇక్కడ అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే రిజల్ట్ డిస్ ప్లే అవుతుంది.

ఏపీలో కానిస్టేబుళ్ల నియామకాల కోసం 2023 ఏడాదిలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఇందుకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరికి 2024 డిసెంబరులో దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో 38,910 మంది అర్హత సాధించారు.

ఏపీలో కానిస్టేబుల్రిక్రూట్ మెంట్ ప్రక్రియ మొదలై రెండేళ్లు కావొస్తోంది. పలు కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ శాఖలో దిగువ స్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై దృష్టి సారించిన కూటమి సర్కార్… నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే జూన్ 1వ తేదీన పరీక్షలను నిర్వహించారు. వీటికి సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఎంపికైన వారికి శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత నియామక పత్రాలను అందజేస్తారు.

News/News/ఏపీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్ - ఫైనల్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
News/News/ఏపీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్ - ఫైనల్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి