ఏపీ జిల్లా కోర్టుల్లో 1620 ఉద్యోగాలు - పరీక్ష తేదీలు ఖరారు, హాల్ టికెట్లు ఎప్పుడంటే..?
ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల భర్తీపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. తాజాగా పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 20 నుంచి 24 తేదీల మధ్య పరీక్షలు జరగనున్నాయి. ఆగస్టు 13 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు కోర్టుల్లోకలిపి మొత్తం 1,620 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు తేదీలు వచ్చేశాయ్. ఈ మేరకు హైకోర్టు వెబ్ సైట్ లో వివరాలను పేర్కొన్నారు.

మొత్తం 1,620 ఖాళీలను రిక్రూట్చేస్తుండగా.... వీటిల్లో అత్యధికంగా ఆఫీస్ సబార్డినేట్(651) ఖాళీలు ఉండగా… ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 230 ఉన్నాయి. ఇవే కాకుండా ప్రాసెస్ సర్వర్, కాపీయిస్ట్, స్టెనో గ్రాఫర్, డ్రైవర్పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఆగస్టు 20వ తేదీ నుంచి ఎగ్జామ్స్ పారంభమై... ఆగస్టు 24వ తేదీతో ముగుస్తాయి. కంప్యూటర్ బేస్డ్ విధానంలో... సెషన్ల వారీగా ఈ పరీక్షలను నిర్వహిస్తారు.
పరీక్ష తేదీలు
- డ్రైవర్, ప్రాసెస్ సర్వర్ - 20.08.2025
- ఆఫీస్ సబార్డినెట్ - 21.08.2025
- కాపీయిస్ట్, ఎగ్జామనిర్, రికార్డ్ అసిస్టెంట్ 22.08.2025
- స్టెనోగ్రాఫ్ గ్రేడ్-III/ 23.08.2025.
- జూనియర్ అసిస్టెంట్, టైపియిస్ట్
ఆగస్టు 13న హాల్ టికెట్లు
ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఆగస్టు 13వ తేదీన అందుబాటులోకి వస్తాయి. https://aphc.gov.in వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎగ్జామ్ సెంటర్ వివరాలతో పాటు టైమింగ్స్ కూడా ఇందులో ఉంటాయి.
ఖాళీల వివరాలు:
- ఆఫీస్ సబార్డినేట్ – 651
- జూనియర్ అసిస్టెంట్ – 230
- కాపీయిస్ట్ – 193
- ప్రాసెస్ సర్వర్ – 164
- టైపిస్ట్ – 162
- స్టెనోగ్రాఫర్ – 80
- ఫీల్డ్ అసిస్టెంట్ – 56
- ఎగ్జామినర్ – 32
- రికార్డు అసిస్టెంట్ – 24
- డ్రైవర్ - 28
కోర్టు ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ నాల్డెజ్ కి 40, జనరల్ ఇంగ్లీష్ 10, మెంటల్ ఎబిలీటికి 30 మార్కులు ఉంటాయి. సమయం 90 నిమిషాలు కేటాయిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ తో పాటు తెలుగు మీడియంలోనూ ఇస్తారు. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాల్డెజ్ ఆధారంగా ప్రశ్నలు ఇస్తారు. కొన్ని ఉద్యోగాలకు నైపుణ్య పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. మార్కులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా మెరిట్ జాబితాను ప్రకటిస్తారు.
రాత పరీక్షలో ఈడబ్యూఎస్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఇక బీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు రావాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను ప్రకటిస్తారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


