...
...
Next Story

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2025 అప్డేట్ : నేటి నుంచే వెబ్ ఆప్షన్లు - ఈనెల 22న సీట్ల కేటాయింపు

ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు.. నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఇందుకు జూలై 18వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. జూలై 22వ తేదీన సీట్లను కేటాయిస్తారు.

Published on: Jul 13, 2025 09:21 AM IST
By , , Andhrapradesh
Prefer HTon Google
Advertisement

ఏపీ ఈఏపీసెట్ - 2025 అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కాగా… ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ జూలై 16వ తేదీతో ముగియనుంది. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు… నేటి (జూలై 13) నుంచి వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఇందుకు జూలై 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

జూలై 22న సీట్ల కేటాయింపు….

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2025
ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2025

కాలేజీల్లో సీట్లు పొందేందుకు వెబ్ ఆప్షన్లను తప్పనిసరిగా ఎంచుకోవాల్సి ఉంటుంది. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోదు. కాబట్టి అర్హులైన అభ్యర్థులు… జూలై 18వ తేదీలోపు https://eapcet-sche.aptonline.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఇక జూలై 19వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక జూలై 22వ తేదీన అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందే అభ్యర్థులు… జూలై 23 నుంచి కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఇందుకు జూలై 26వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆగస్టు 4వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ప్రాసెసింగ్ కింద ఓసీ/బీసీ అభ్యర్థులకు ఫీజు రూ. 1200, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 600 గా నిర్ణయించారు. ఈ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి… అభ్యర్థులు ఏపీ ఈఏపీసెట్ ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే 7995681678, 7995865456, 9177927677 హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

ఏపీ ఈఏపీసెట్పరీక్షలు మే 19 నుంచి మే 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగాయి. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహించారు. మే21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో జరిగాయి. మే 27న అగ్రికల్చర్‌, ఫార్మసి ప్రాథమిక కీని విడుదల చేశారు. మే 28వ తేదీన ఇంజినీరింగ్ ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. మే 30వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. జూన్ 8వ తేదీన ఫలితాలను విడుదల చేశారు.

ఇక ఇంజినీరింగ్ స్టీమ్ లో చూస్తే… 2,80,611 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,64,840 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,89,748 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తంగా 71.65 ఉత్తీర్ణత శాతం నమోదైన సంగతి తెలిసిందే. వీరంతా కూడా సీట్ల కోసం పోటీ పడుతున్నారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఈఏపీసెట్ -2025 కౌన్సెలింగ్ కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe