ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2025 అప్డేట్ : నేటి నుంచే వెబ్ ఆప్షన్లు - ఈనెల 22న సీట్ల కేటాయింపు
ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు.. నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఇందుకు జూలై 18వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. జూలై 22వ తేదీన సీట్లను కేటాయిస్తారు.
ఏపీ ఈఏపీసెట్ - 2025 అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కాగా… ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ జూలై 16వ తేదీతో ముగియనుంది. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు… నేటి (జూలై 13) నుంచి వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఇందుకు జూలై 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

జూలై 22న సీట్ల కేటాయింపు….
కాలేజీల్లో సీట్లు పొందేందుకు వెబ్ ఆప్షన్లను తప్పనిసరిగా ఎంచుకోవాల్సి ఉంటుంది. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోదు. కాబట్టి అర్హులైన అభ్యర్థులు… జూలై 18వ తేదీలోపు https://eapcet-sche.aptonline.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇక జూలై 19వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక జూలై 22వ తేదీన అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందే అభ్యర్థులు… జూలై 23 నుంచి కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఇందుకు జూలై 26వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆగస్టు 4వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ప్రాసెసింగ్ కింద ఓసీ/బీసీ అభ్యర్థులకు ఫీజు రూ. 1200, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 600 గా నిర్ణయించారు. ఈ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి… అభ్యర్థులు ఏపీ ఈఏపీసెట్ ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే 7995681678, 7995865456, 9177927677 హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
ఏపీ ఈఏపీసెట్పరీక్షలు మే 19 నుంచి మే 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగాయి. మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహించారు. మే21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరిగాయి. మే 27న అగ్రికల్చర్, ఫార్మసి ప్రాథమిక కీని విడుదల చేశారు. మే 28వ తేదీన ఇంజినీరింగ్ ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. మే 30వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. జూన్ 8వ తేదీన ఫలితాలను విడుదల చేశారు.
ఈసారి అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ కు 81,837 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా… 75460 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 89.8 శాతం క్వాలిఫై అయ్యారు.
ఇక ఇంజినీరింగ్ స్టీమ్ లో చూస్తే… 2,80,611 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,64,840 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,89,748 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తంగా 71.65 ఉత్తీర్ణత శాతం నమోదైన సంగతి తెలిసిందే. వీరంతా కూడా సీట్ల కోసం పోటీ పడుతున్నారు.

E-Paper












