ఏపీ ఎడ్‌సెట్ - 2025 ఫ‌లితాలు విడుద‌ల‌ - ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఏపీ ఎడ్ సెట్ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. అర్హత సాధించిన వారికి బీఈఈ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. cets.apsche.ap.gov.in/EDCET లింక్ తో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ వివరాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Published on: Jun 20, 2025, 14:30:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేష‌న్ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్ ఫ‌లితాలు వచ్చేశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. 5 విభాగాల్లో కలిపి మొత్తం 99.42 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. మొత్తం 17,795 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా… 14,527 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.

ఏపీ ఎడ్ సెట్ 2025 ఫలితాలు
ఏపీ ఎడ్ సెట్ 2025 ఫలితాలు

ఫ‌లితాల‌ను ఇలా చెక్ చేసుకోండి…

  1. అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ఎడ్ సెట్ - 2025 ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.
  3. రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌, ఎడ్‌సెట్ హాల్ టికెట్ నెంబ‌ర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట‌ర్ చేయాలి.
  4. సబ్మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేస్తే ఫ‌లితాలు డిస్ ప్లే అవుతాయి.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
  6. అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.

మనమిత్ర వాట్సాప్ లో ఇలా…

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్రవాట్సాప్ ద్వారా కూడా ఏపీ ఎడ్ సెట్ రిజల్ట్స్ ను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలు కింది విధంగా ఉంటాయి….

Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.

Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.

Step 3 : 'ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు - 2025' పై క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేష్ నెంబర్ ను నమోదు చేయాలి.

Step 4 : సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్లే అవుతుంది.

ఏపీ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మినహా మిగిలిన అభ్యర్థులందరికీ 150 మొత్తం మార్కులకు 37 మార్కులు (అంటే 25%) అర్హత మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ర్యాంకింగ్ కోసం ఎటువంటి అర్హత మార్కులు లేవు. ఫిజికల్ సైన్సెస్ / మ్యాథమెటిక్స్ మెథడాలజీలలో మహిళలకు కనీస అర్హత మార్కులు వర్తించవు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఎడ్ సెట్ - 2025 ర్యాంక్ కార్డును నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More