ఏపీ ఐసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 10 నుంచి రిజిస్ట్రేషన్లు

ఏపీ ఐసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.  జూలై 10వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకు జూలై 14వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జూలై 13 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం ఉంటుంది. ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు.

Published on: Jul 09, 2025 10:33 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ ఐసెట్ - 2025 అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఖరారు చేస్తూ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు.

ఏపీ ఐసెట్ - 2025 కౌన్సెలింగ్
ఏపీ ఐసెట్ - 2025 కౌన్సెలింగ్

జూలై 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ… జూలై 14వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత జూలై 13 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఈ గడువు జూలై 16వ తేదీతో పూర్తవుతుంది.

అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందే విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. లేకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఏపీలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్ -2025 నిర్వహించారు. మే 20 వ తేదీన ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఐసెట్ ప్రవేశ పరీక్ష బాధ్యతలను ఆంధ్ర యూనివర్సిటీ చేపట్టింది.

మే 7న రాష్ట్రంలోని 94 పరీక్ష కేంద్రాల్లో ఐసెట్నిర్వహించారు. ఐసెట్ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ICET/ ఈ లింక్ లో తెలుసుకోవచ్చు. మొత్తం 34,131 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా…. 32,719 మంది(95.86%) విద్యార్థులు ఐసెట్ పరీక్షలో అర్హత సాధించారు.

ఏపీ ఐసెట్ వివరాలు

  • AP ICET-2025 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మొత్తం సంఖ్య- 37.572
  • AP ICET-2025కి హాజరైన అభ్యర్థుల మొత్తం సంఖ్య- 34.131
  • AP ICET-2025లో అర్హత సాధించిన అభ్యర్థుల మొత్తం సంఖ్య- 32.719
  • AP ICET-2025లో పరీక్షా కేంద్రాల సంఖ్య- 94
  • అర్హత సాధించిన అభ్యర్థుల శాతం: 95.86%
News/News/ఏపీ ఐసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 10 నుంచి రిజిస్ట్రేషన్లు
News/News/ఏపీ ఐసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 10 నుంచి రిజిస్ట్రేషన్లు