ఏపీ ఐసెట్ - 2025 అభ్యర్థులకు కీలక అప్డేట్. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ఇవాళ్టి (జూలై 10) నుంచి ప్రారంభం కానుంది. జూలై 14వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత జూలై 13 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఈ గడువు జూలై 16వ తేదీతో పూర్తవుతుంది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1200 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి.
జూలై 19న సీట్ల కేటాయింపు…

జూలై 11 నుంచి 15 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.జూలై 17వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. జూలై 19వ తేదీన ఐసెట్ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 20వ తేదీ నుంచి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ గడువు జూలై 22వ తేదీతో పూర్తవుతుంది. రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. జూలై 21వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందే విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. లేకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. https://cets.apsche.ap.gov.in / వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ - కావాల్సిన పత్రాలు
- ఏపీ ఐసెట్ హాల్ టికెట్
- ఏపీ ఐసెట్ ర్యాంక్ కార్డు
- టీసీ
- డిగ్రీ మెమో
- డిగ్రీ ప్రొవిజినల్ సర్టిఫికెట్
- ఇంటర్ మెమో
- పదో తరగతి మెమో
- స్టడీ సర్టిఫికెట్లు
- రెసిడెన్స్ సర్టిఫికెట్
- ఆదాయ ధ్రువీకరణపత్రం, రేషన్ కార్జు
- కుల ధ్రువీకరణపత్రం
- ఈడబ్యూఎస్ ధ్రువీకరణపత్రం
- స్థానికత సర్టిఫికెట్ తో పాటు ఇతర పత్రాలు
ఏపీలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్-2025 నిర్వహించారు. మే 7న రాష్ట్రంలోని 94 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. మే 20 వ తేదీన ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఐసెట్ ప్రవేశ పరీక్ష బాధ్యతలను ఆంధ్రా యూనివర్సిటీ చేపట్టింది. ఐసెట్ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ICET/ ఈ లింక్ లో తెలుసుకోవచ్చు. మొత్తం 34,131 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా…. 32,719 మంది(95.86%) విద్యార్థులు ఐసెట్ పరీక్షలో అర్హత సాధించారు.