ఏపీ ట్రిపుల్ ఐటీల్లో మిగిలిన సీట్లు - ఈనెల 14 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్..!
ఏపీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగిసింది. అయితే 500కుపైగా సీట్లు మిగిలిపోవటంతో… రెండో విడత కౌన్సెలింగ్ కు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ జూలై 14వ తేదీ నుంచి షురూ కానుంది.
రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది. కౌన్సెలింగ్ అనంతరం 4 ట్రిపుల్ ఐటీల్లో కలిపి 598 సీట్లు మిగిలాయి. దీంతో ఈ సీట్ల భర్తీకి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

జూలై 14 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్…
రాష్ట్రంలోని ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1,010 సీట్లు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ తర్వాత… నూజివీడులో 139, ఇడుపులపాయలో 132, శ్రీకాకుళంలో 144, ఒంగోలులో అత్యధికంగా 183 సీట్లు మిగిలాయి. ఈ సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 14 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కాగా ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన వారికి ఈ నెల 14 నుంచే తరగతులను ప్రారంభించనున్నారు.
పదవ తరగతిలో మార్కుల ఆధారంగా 6 ఏళ్ల బీటెక్ కోర్సులో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి ట్రిపుల్ ఐటీల్లో 94.78 శాతం సీట్లను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సుగా (యూపీసీ) పరిగణిస్తారు. మిగతా నాలుగేళ్లు బీటెక్ చదువుతారు. ఈసారి ఆర్జీయూకేటీలోప్రవేశాలకు మొత్తం 50,541 దరఖాస్తులు రాగా.. వాటిల్లో నుంచి నాలుగు క్యాంపస్‌లకు కలిపి మెరిట్ జాబితాలను విడుదల చేశారు.ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన తర్వాత… సీట్లను ఖరారు చేశారు.
సీట్లు పొందిన వారిలో అత్యధికంగా 69.01 శాతం మంది బాలికలు ఉండగా.. బాలురు 30.99 శాతం మంది ఉన్నారు. నూజివీడు క్యాంపస్‌కు సంబంధించి నూజివీడులో ధ్రువపత్రాల పరిశీలన జూన్ 30, జులై 1న నిర్వహించారు. శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లకు సంబంధించి నూజివీడులో జులై 2 నుంచి 5 వరకు పూర్తి చేశారు. ఇడుపులపాయకు (ఆర్కేవ్యాలీ) సంబంధించి ఆర్కేవ్యాలీలో జూన్ 30 నుంచి జులై 1 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. దీంతో ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. మిగిలిపోయిన సీట్ల కోసం జూలై 14వ తేదీ నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
కౌన్సెలింగ్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా 15 రోజులు ఆలస్యం కావడం వల్ల చాలా మంది పాలిటెక్నిక్, ఇంటర్ కాలేజీల్లో చేరిపోయి ఉంటారని తెలుస్తోంది. దీంతో 500కుపైగా సీట్లు మిగిలినట్లు అంచనా వేస్తున్నారు. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


