AP Inter Supply Results 2025 : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. పరీక్ష రాసిన విద్యార్థులు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ బోర్డు వెబ్ సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ (9552300009) నెంబర్ తో ఫలితాలను తెలుసుకోవచ్చు.
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం…. ఇవాళ ఉదయం 11 గంటల ఫలితాలను అందుబాటులో ఉంచారు.

ఏపీలో ఈ ఏడాది ఇంటర్అడ్వాన్స్ సప్లిమెంటరీపరీక్షలు మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 1,35,826 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక సెకండ్ ఇయర్ పరీక్షలను 97,963 మంది విద్యార్థులు రాశారు.
ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఫలితాలు:
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
- విద్యార్థులు ఏపీ ఇంటర్ విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ పై క్లిక్ చేయాలి.
- వెబ్‌సైట్ హోమ్‌పేజీ లో 'AP IPE అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు 2025' అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత ఇంటర్ 1వ సంవత్సరం లేదా 2వ సంవత్సరం ఫలితాలపై క్లిక్ చేయండి. లాగిన్ విండో ఓపెన్ అవుతుంది.
- లాగిన్ విండోలో విద్యార్థి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయండి.
- స్క్రీన్ పై ఇంటర్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- భవిష్యత్ అవసరాల కోసం ఇంటర్ మార్క్ షీట్ డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
మనమిత్రలో ఇలా చెక్ చేసుకోండి:
ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.
Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.
Step 3 : 'డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు- 2025' ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4 : మార్కుల మెమో పొందడానికి మీ 'హాల్ టికెట్' నెంబర్‌ను నమోదు చేయాలి.
Step 5 : PDF రూపంలో ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ -2025 ఫలితాలను చెక్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


