ఏపీ విద్యార్థులకు అలర్ట్ - ఇంటర్మీడియట్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే..?

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలపై ఏపీ ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రవేశాల గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది. అర్హులైన విద్యార్థులు ఈ తేదీలోపు అడ్మిషన్లు తీసుకోవచ్చు. 

Published on: Jul 03, 2025 10:06 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి.ఈ గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా జా ఓ ప్రకటన ద్వారా ప్రకటించారు. అర్హులైన విద్యార్థులు… వెంటనే అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు.

ఏపీ ఇంటర్ బోర్డు ప్రవేశాలు
ఏపీ ఇంటర్ బోర్డు ప్రవేశాలు

తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… జూన్ 30వ తేదీతోనే ప్రవేశాల గడువు ముగిసింది. అయితే విద్యార్థులతో పాటు పలువురి నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో… ఈ గడువును పొడిగించారు. దీంతో టెన్త్పాస్ అయిన విద్యార్థులు… జూలై 30వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోవచ్చు.

అకడమిక్ క్యాలెండర్ ఇలా…

ఇక 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్బోర్డు ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్ ను కూాడా విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ జూనియర్ కాలేజీలు మొత్తం 314 పని దినాలు పని చేస్తాయి. మొత్తం 79 రోజులు సెలవులు ఉండనున్నాయి.

అకడమిక్ షెడ్యూల్ ప్రకారం… ఏపీలో జూన్ 2 కాలేజీలు పునఃప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇంటర్ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు జరుగుతున్నాయి. సెకండ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు కొనసాగుతున్నాయి.సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 దసరా సెలవులు ఉంటాయి. ఇక జనవరి 10 – జనవరి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ఫిబ్రవరి 2026లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తాయి. మార్చి 2026లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి.

News/News/ఏపీ విద్యార్థులకు అలర్ట్ - ఇంటర్మీడియట్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే..?
News/News/ఏపీ విద్యార్థులకు అలర్ట్ - ఇంటర్మీడియట్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే..?