ఏపీ లాసెట్ 2025 ఫలితాలు విడుదల - మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

ఏపీ లాసెట్ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలు రాసిన అభ్యర్థులు cets.apsche.ap.gov.in/LAWCET/ వెబ్ సైట్ లోకి వెళ్లి ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. 

Published on: Jun 19, 2025, 15:21:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ లాసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయ విద్య కాలేజీల్లోని మూడేళ్లు, ఐదేళ్లు, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు… cets.apsche.ap.gov.in/LAWCET/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఏపీ లాసెట్ - 2025 ఫలితాలు
ఏపీ లాసెట్ - 2025 ఫలితాలు

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్వెల్లడించిన వివరాల ప్రకారం… లాసెట్కు మొత్తం 27,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా…20,826 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మూడేళ్లు, ఐదేళ్ల లా, పీజీ ఎంట్రెన్స్ పరీక్షలన్నీ కలిపి 95 శాతానికిపైగా ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాలను మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.

ఏపీ లాసెట్ 2025 ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి:

  1. అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/LAWCET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే లాసెట్ ఫలితాలపై క్లిక్ చేయండి.
  3. మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
  6. అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.

మనమిత్ర వాట్సాప్ లో ఇలా…

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఏపీ లాసెట్ రిజల్ట్స్ ను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలు కింది విధంగా ఉంటాయి….

Step 1 : ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయాలి.

Step 2 : ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోవాలి.

Step 3 : 'ఏపీ లాసెట్ ఫలితాలు - 2025' పై క్లిక్ చేయాలి.

Step 4 : మీ ర్యాంక్ కార్డు డిస్లే అవుతుంది.

లాసెట్ ఎంట్రెన్స్పరీక్షలోని ర్యాంకులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా కాలేజీల్లో సీట్లను కేటాయిస్తారు. ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఖరారు చేస్తారు. దశల వారీగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More