ఏపీ డీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం...! నిమిషం రూల్ అమలు, ఈ విషయాలను తప్పక తెలుసుకోండి

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రేపట్నుంచే ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జులై 6వ తేదీతో ఈ పరీక్షలన్నీ  ముగుస్తాయి. ప్రతి రోజూ రెండు సెషన్ల వారీగా నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులకు అధికారులు కీలక సూచనలు చేశారు.

Published on: Jun 5, 2025, 10:01:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లను సిద్ధం చేసింది. రేపట్నుంచే(జూన్ 6) ఈ పరీక్షలు ప్రారంభమై… జూలై 6వ తేదీతో ముగుస్తాయి. నెల రోజులపాటు జరిగే ఈ పరీక్షలను…. ప్రతి రోజూ రెండు సెషన్లవారీగా పూర్తి చేస్తారు. మరోవైపు ఇప్పటికే అభ్యర్థుల హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో ఏమైనా తప్పులు ఉంటే… పరీక్షా కేంద్రాల వద్ద సరిచేసుకోవచ్చని తాజాగా విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు 2025
ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు 2025

డీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం - ముఖ్య వివరాలు

  • మొత్తం 154 కేంద్రాల్లో డీఎస్సీ పరీక్షలను నిర్వహిస్తారు. ఆన్ లైన్ విధానంలో ఉంటాయి. జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరుగుతాయి.
  • ఏపీ డీఎస్సీపరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. కాబట్టి అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది.
  • హాల్‌టికెట్లలో ఏమైన తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. సంబంధించిన గుర్తింపు కార్డులను పరీక్ష కేంద్రాల వద్ద సమర్పిస్తే వాటిని సరి చేస్తారని తాజాగా తెలిపింది.
  • తల్లిదండ్రుల పేర్లు, డేట్ ఆఫ్ బర్త్, కులంతో పాటు ఇతర వివరాలు తప్పుగా నమోదైతే దీనికి సంబంధించిన ఆధారాలను చూపిస్తే నామినల్‌ రోల్స్‌లో సరి చేస్తారని వివరించింది.
  • హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోతే అభ్యర్థులు కేంద్రానికి రెండు ఫొటోలు తీసుకువెళ్లాలి.
  • ఆధార్, ఓటరు ఐడీ, పాన్‌ కార్డు వంటి ధ్రువీకరణపత్రాలను చూపించాలి.
  • ఏపీ డీఎస్సీ పరీక్షల కోసం ఏపీలోనే కాకుండా…. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు చోటు చేసుకుండా కఠిన చర్యలు చేపట్టింది.
  • డీఎస్సీ పరీక్షలను రోజూ రెండు సెషన్ల వారీగా నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మరో సెషన్ జరుగుతుంది.
  • ప్రిన్సిపల్, పీజీటీ, పీడీ పోస్టులకు పరీక్ష మూడు గంటలపాటు ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. మరోవైపు టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ అభ్యర్థులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నైపుణ్య పరీక్ష ఉంటుంది. ఇందుకు గంటన్నర సమయం కేటాయించారు.
  • హాల్ టికెట్లలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. అభ్యర్థులు హెల్ప్ డెస్క్‌కు కాల్ చేయవచ్చు. (6281704160, 8121947387, 8125046997, 9398810958, 7995649286, 7995789286, 9963069286, 7013837359) నంబర్లకు ఫోన్ చేసి.. అభ్యంతరాలను నివృత్తి చేసుకోవచ్చు.
  • dscgrievances@apschooledu.in ఐడీకి మెయిల్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అని డీఎస్సీ కన్వీనర్ ఎం.వెంకట కృష్ణారెడ్డి వివరించారు.
  • ఏపీ మెగా డీఎస్సీలోభాగంగా…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీకి 3,35,401 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకోగా… అన్ని పోస్టులకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.
  • డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లో విడుదల చేస్తారు. ప్రాథమిక కీల విడుదల తర్వాత 7 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
  • అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత ఫైనల్ కీని ప్రకటిస్తారు. తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా విడుదలవుతాయి.
  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More