ఏపీ మెగా డీఎస్సీ హాల్ టికెట్ల విడుదలపై అప్డేట్ - జూన్ 6 నుంచి పరీక్షలు
ఏపీ మెగా డీఎస్సీ హాల్ టికెట్లు రేపు(శుక్రవారం) విడుదల కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు apdsc.apcfss.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పరీక్షలు జూన్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఏపీ మెగా డీఎస్సీకి సంబంధించి మరో అప్డేట్. రేపట్నుంచి(మే 30) హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈసారి ఈ మెగా డీఎస్సీకి3,35,401 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకోగా… అన్ని పోస్టులకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.
ఒక్కో పోస్టుకు 35 మంది పోటీ…!
ఒక్కో పోస్టుకు సరాసరి 35 మంది పోటీ పడుతున్నారు. ఈసారి మహిళలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. దాదాపు 2,03,647 మంది మహిళా అభ్యర్థులు, 1,31,754 మంది పురుషుల నుంచి దరఖాస్తులు అందాయి. డీఎస్సీపోస్టులు అధికంగా ఉన్న కర్నూలు జిల్లాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2678 పోస్టులు ఉండగా.. 39,997 మంది అభ్యర్థుల నుంచి మొత్తం 73,605 అప్లికేషన్లు వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి 7,159 మంది అభ్యర్థుల నుంచి 10,143 అప్లికేషన్లు వచ్చాయి.
హాల్ టికెట్ డౌన్లోడ్ ఇలా….
ఏపీ మెగా డీఎస్సీలో భాగాగం…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం….మే 30వ తేదీ నుంచి నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి. https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వారి లాగిన్ వివరాలతో సులభంగా వీటిని పొందే అవకాశం ఉంటుంది.
జూన్ 6 నుంచి పరీక్షలు….
ఏపీ డీఎస్సీపరీక్షలు జూన్ 6 నుంచి ప్రారంభమై…. జులై 6వ తేదీ వరకు జరుగుతాయి. సీబీటీ విధానంలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లో విడుదల చేస్తారు. ప్రాథమిక కీల విడుదల తర్వాత 7 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత ఫైనల్ కీని ప్రకటిస్తారు. తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా విడుదలవుతాయి.
పరీక్షల సమయం దగ్గరపడిన నేపథ్యంలో…. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రోజుకి సరాసరి 40 నుంచి 50 వేల మందికి ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ మేరకు కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రేపోమాపో వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


