ఏపీ పీజీఈసెట్-2025 హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఏపీ పీజీఈసెట్ -2025 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు cets.apsche.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి 8 తేదీల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి.
రాష్ట్రంలో పీజీ ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీఈసెట్ - 2025కు సంబంధించిన హాల్ టికెట్లు వచ్చేశాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు cets.apsche.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా సూచించారు. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. ఈ సెట్‌ను ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) నిర్వహిస్తోంది.

హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
- అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/PGECET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- డౌన్లోడ్ హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
జూన్ 6 నుంచి జూన్ 8 వరకు ఏపీ పీజీఈసెట్-2025 ఎంట్రెన్స్పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఒక సెషన్ , మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది. ప్రిలిమినరీ కీని జూన్ 11న సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తారు. జూన్ 14 రాత్రి 11.59 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూన్ 24వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ పీజీఈసెట్-2025 హాల్ టికెట్ నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


