...
...
Next Story

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్‌ ప్రారంభం - ఈనెల 9న సీట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా

ఏపీ పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. జూలై 5వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది. జూలై 9వ తేదీన మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.

Published on: Jul 2, 2025, 14:21:20 IST
By , , Andhrapradesh
Prefer HTon Google
Advertisement

ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు సాంకేతి విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేయగా… కొత్తగా తేదీలను ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా… రిజిస్ట్రేషన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.వెబ్ ఆప్షన్లు కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

జూలై 9న సీట్ల కేటాయింపు - ముఖ్య తేదీలు

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ - 2025
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ - 2025

ర్యాంకుల ఆధారంగా… జూలై 5వ తేదీ వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్లు (వెబ్ ఆప్షన్లు) చేసుకోవాలి. ఫీజు కూడా చెల్లించాలి. https://polycet.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 700, ఎస్సీ, ఎస్టీ వాళ్లు రూ. 250 చెల్లించాలి. అయితే జూలై6వ తేదీన అభ్యర్థులు ఎంచుకున్న వెబ్ ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఉంటుంది.

అభ్యర్థులు సాధించిన ర్యాంకులతో పాటు వారు ఎంచుకున్నవెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. జూలై 9వ తేదీన సీట్లను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో జూలై 10వ తేదీ నుంచి14 తేదీల మధ్య రిపోర్టింగ్ చేయాలి. జూలై 10వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

ఏపీ పాలిసెట్కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉంటే convenorpolycetap2025@gmail.com కు మెయిల్ చేయవచ్చు. ఇక 7995681678, 7995865456, 9177927677 హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

గత నెలలోనే ఏపీ పాలిసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు polycetap.nic.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30, 2025న జరిగిన పాలిసెట్ పరీక్షకు 1,39,840 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. వీరిలో 1,33,358 మంది అభ్యర్థులు అంటే 95.36 శాతం ఉత్తీర్ణులయ్యారు. వీరంతా కూడా కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొననున్నారు. వీరికి ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుకోవచ్చు…

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks