...
...
Next Story

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్‌ వాయిదా - మళ్లీ ఎప్పట్నుచంటే...?

ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు సాంకేతి విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేసింది. జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని తాజా ప్రకటన ద్వారా వెల్లడించింది. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

Published on: Jun 28, 2025, 09:37:23 IST
By , , Andhrapradesh
Prefer HTon Google
Advertisement

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసింది. ఇందులో భాగంగా జూన్ 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ సాంకేతి విద్యాశాఖ ఈ ప్రక్రియను వాయిదా వేసింది. కళాశాలలకు అనుమతుల జారీలో జాప్యం జరుగుతుండడంతో వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

జూన్ 30 నుంచి వెబ్ ఆప్షన్లు….

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్

జూన్ 30వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ కానుంది. ప్రస్తుతం ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు మాత్రం జూన్ 30వ తేదీ నుంచే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు https://polycet.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 700, ఎస్సీ, ఎస్టీ వాళ్లు రూ. 250 చెల్లించాలి.

ర్యాంకుల ఆధారంగా సీట్లు…

ఫీజు చెల్లించే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం పాలిసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ నెంబర్, పదో తరగతి మెమో, స్టడీ సర్టిఫికెట్ వివరాలను ఎంట్రీ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత… కాలేజీల కోసం వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. మీ ర్యాంక్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అలాట్ మెంట్ కాపీని https://polycet.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి పొందవచ్చు. హాల్ టికెట్ నెంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాట్ మెంట్ కాపీని సీటు పొందిన కాలేజీలో సమర్పించి.. సీటును కన్ఫర్మ్ చేసుకోవాలి.

గత నెలలోనే ఏపీ పాలిసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు polycetap.nic.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30, 2025న జరిగిన పాలిసెట్ పరీక్షకు 1,39,840 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. వీరిలో 1,33,358 మంది అభ్యర్థులు అంటే 95.36 శాతం ఉత్తీర్ణులయ్యారు. వీరంతా కూడా కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొననున్నారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks