ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు సాంకేతి విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇవాళ ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించనుంది. సీట్లు పొందిన విద్యార్థులు... https://polycet.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చని అధికారులు సూచించారు. ర్యాంకుల ఆధారంగా వీటిని కేటాయిస్తారు.
రిపోర్టింగ్ తేదీలు…

ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో జూలై 10వ తేదీ నుంచి రిపోర్టింగ్ చేయాలి. జూలై 14 తేదీ వరకు గడువు ఇచ్చారు. ఈలోపే రిపోర్టింగ్ చేయకపోతే...సీటు కేటాయింపును రద్దు చేస్తారు. జూలై 10వ తేదీ నుంచి పాలిసెట్ తరగతులు ప్రారంభమవుతాయి.
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉంటే convenorpolycetap2025@gmail.com కు మెయిల్ చేయవచ్చు. ఇక 7995681678, 7995865456, 9177927677 హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
అలాట్ మెంట్ ఇలా చెక్ చేసుకోండి
- కౌన్సెలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు polycet.ap.gov.in. వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఏపీ పాలిసెట్ సీట్ల కేటాయింపు ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది
- మీ లాగిన్ వివరాలను ఎంట్రీ చేయాలి. మీకు కేటాయించిన కాలేజీ వివరాలు కనిపిస్తాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.
గత నెలలోనే ఏపీ పాలిసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు polycetap.nic.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30, 2025న జరిగిన పాలిసెట్ పరీక్షకు 1,39,840 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. వీరిలో 1,33,358 మంది అభ్యర్థులు అంటే 95.36 శాతం ఉత్తీర్ణులయ్యారు. వీరంతా కూడా సీట్ల కోసం కౌన్సెలింగ్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరికి ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించారు.