ఏపీ గ్రూప్ -1 మెయిన్స్ ఫలితాలు విడుదల - లిస్ట్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. జూన్ 23 నుంచి 30 వరకు గ్రూప్-1 ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.
ఏపీ గ్రూప్ 1 ఫలితాలు వచ్చేశాయ్. ఈ మేరకు ఏపీపీఎస్సీ మంగళవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసింది. జూన్ 23 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలు జరగనున్నట్లు తెలిపింది.

ఏపీ గ్రూప్ 1 ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
- ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ రాసిన అభ్యర్థులు https://portal-psc.ap.gov.in/Default వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి.
- ఇక్కడ రిజల్ట్స్ నోటిఫికేషన్, వెబ్ నోట్, స్పోర్ట్స్ కోటా ఆప్షన్స్ ఉంటాయి.
- ఇందులో రిజల్ట్స్ నోటిఫికేషన్ పై క్లిక్ చేస్తే క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లు ఉంటాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
మొత్తం 81 గ్రూప్ -1 పోస్టులకు గతేడాది మార్చి 17వ తేదీన ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. ఆ తర్వాత మెయిన్స్ పరీక్షలను నిర్వహించారు. ఇందుకు దాదాపు 4 వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో అర్హత సాధించిన వారి ఫలితాలను ఏపీపీఎస్సీతాజాగా వెల్లడించారు. వీరికి జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ గ్రూప్ 1 ఫలితాల జాబితాను పొందవచ్చు.
స్పోర్ట్ కోటా కింద అర్హత సాధించిన వారి వివరాలను ఈ లింక్ పై క్లిక్ చేసి చూడొచ్చు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper












