ఏపీ అటవీ శాఖలో 691 ఉద్యోగాలు - నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలివే
అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.మొత్తం 691 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈనెల 16 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ అవుతుంది.
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అటవీశాఖలో ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 691 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మేరకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు తేదీలివే….
ఈ నోటిఫికేషన్ లో భాగంగా 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు (256 + 435)) భర్తీ చేయనున్నారు. ఈనెల 16 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు వయసు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. https://portal-psc.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఓటీఆర్ ప్రాసెస్ పూర్తి చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - ఏపీపీఎస్సీ
- ఉద్యోగాలు - ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్
- ఖాళీల వివరాలు - ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ -256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్-435
- దరఖాస్తులు - ఆన్ లైన్
- దరఖాస్తులు ప్రారంభం - 16 జూలై 2025
- దరఖాస్తులకు చివరి తేదీ -5 ఆగస్టు 2025
- దరఖాస్తు ఫీజు - రూ. 250. ప్రాసెస్ ఫీజు కింద మరో రూ. 80 చెల్లించాలి.
- జీతం - ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కు రూ. 25,220 - 80,910గా ఉంటుంది.అసిస్టెంట్ బీట్ ఆఫీసర్‌కు రూ. 23,120 - 74,770గా ఉంటుంది.
- అభ్యర్థులు ఇంటర్మీడియట్ తప్పనిసరిగా పాసై ఉండాలి.అంతేకాకుండా ఎత్తుతో పాటు ఫిజికల్ టెస్టుల్లో పాస్ కావాల్సి ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది.
- ఎంపిక విధానం - స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో అర్హత పొందిన అభ్యర్థులకే మెయిన్స్ పరీక్ష ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ - https://portal-psc.ap.gov.in/Default
ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ లో పేర్కొన్న పూర్తి వివరాలను చూడొచ్చు…
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


