...
...
Next Story

ఉద్యోగం పోయిన తర్వాత బతకడం గురించి ఆందోళన చెందుతున్నారా? ఒక్కసారి ఇది చదవండి!

ఇటీవలి కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో కొందరు బలంగా బౌన్స్ బ్యాక్ అవుతుంటే.. మరికొందరు కుమిలిపోతున్నారు. ఉద్యోగం పోయిన తర్వాత కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోండి.

Published on: Jun 25, 2025, 13:00:09 IST
By ,
Prefer HTon Google
Advertisement

అనేక కంపెనీలు ఉద్యోగాల కోతలు చాలా మంది ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నిసార్లు ఈ నిర్ణయాలు ఎలాంటి అలర్ట్ లేకుండా వచ్చేస్తాయి. ఆకస్మాత్తుగా ఏదో మెయిల్ వచ్చి.. మరుసటి రోజు నుంచి మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పేస్తారు. అప్పుడు ఉద్యోగి మానసిక వేదన దారుణంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో స్థిరమైన మనస్సును కలిగి ఉండటం, అర్థవంతమైన ఆలోచన చేయడం ముఖ్యం. మీరు అనుభవించే భావోద్వేగాల నుంచి బయటపడాలి..

కారణాలు అనేకం

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగం కోల్పోయిన తర్వాత తర్వాత ఏం చేయాలో అని ఆందోళన చెందడం సహజం. కానీ ముందుగా మీరు అనుభవిస్తున్న విచారం, నిరాశ లేదా కోపాన్ని తగ్గించుకోండి. ఎందుకంటే ఇది మీ తప్పు కాదు.. ఇది మార్పులో భాగం. ఉద్యోగ తొలగింపునకు దారితీసే అనేక అంశాలు ఉండవచ్చు. ఆర్థిక సంక్షోభం, కంపెనీ పునర్నిర్మాణం, సాంకేతిక మార్పు.. ఇలా అనేక కారణాలు ఉంటాయి. ఉద్యోగంలో నుంచి మిమ్మల్ని తొలగించినంత మాత్రాన.. మీ సామర్థ్యాలకు లేదా నైపుణ్యాలు తక్కువ ఉన్నట్టు కాదు.

బ్రేక్ తీసుకోండి

భావోద్వేగాలు తగ్గించికున్న తర్వాత ఓ వారం రోజులు మంచి బ్రేక్ తీసుకోండి. మీ కుటుంబంతో సమయం గడపండి. చదవడం, ధ్యానం చేయడం లేదా నడక వంటి కార్యకలాపాలలో పాల్గొనండి. ఇది మీ మానసిక బలాన్ని తిరిగి పొందడానికి మీకు సహాయపడుతుంది. మిమ్మల్ని మీరు వెతక్కోవచ్చు.

ఇలా చేయండి

ఉద్యోగం కోల్పోవడం ఆర్థిక భారం కావచ్చు. మీరు వెంటనే ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. బ్యాంకు ఖాతాల్లో ఎంత మిగిలి ఉంది? తుది జీతం, బోనస్ లేదా చివరిగా ఏమైనా ప్యాకేజీ ఇస్తా అన్నారా? ఏ ఖర్చులు అవసరం, వేటిని స్కిప్ చేయాలి. లోన్, ఈఎంఐ, బిల్లు చెల్లింపు మొదలైన తప్పనిసరి ఖర్చుల లిస్ట్ వేసుకోండి. ఈ వివరాలను సేకరించుకుని వచ్చే కొన్ని నెలలకు ప్రణాళిక వేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే ఇలాంటి సమయంలో చాలా ఉపయోగపడుతుంది.

సెర్చ్ చేయండి

పని లేదు కదా అని మరీ ఎక్కువగా రోడ్ల మీద తిరగకండి. చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మీ పాత పనిని అంచనా వేయడానికి, కొత్త నైపుణ్యాలను అభ్యసించడానికి, ఆసక్తి ఉన్న ప్రాంతాలకు ప్రయాణించడానికి ప్లాన్ చేయండి. అవసరమైతే వ్యాపార ఆలోచనలను అన్వేషించండి, ఫ్రీలాన్స్ పని వైపు చూడండి. కొన్ని కోర్సులు ఉంటాయి నేర్చుకోండి. కొత్త కోర్సులు, డిజిటల్ సర్టిఫికేషన్లు, భాషా శిక్షణ, కోడింగ్, డేటా అనలిటిక్స్ మొదలైన వాటిని తక్కువ ఖర్చుతో అభ్యసించవచ్చు. మీరు కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు ఇవి మీకు సాయపడతాయి.

సోషల్ మీడియా

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లకు దూరంగా ఉండండి. ఇతరులు తమ విజయాలను ప్రదర్శించే ప్లాట్‌ఫామ్‌లపై ఎక్కువ సమయం గడపకండి. ఇది మీ నిరాశకు దారితీయవచ్చు. మీ స్వంత వృద్ధిపై దృష్టి పెట్టండి. ఉద్యోగం కోల్పోవడం జీవితం ఆగిపోవడం కాదు.. మీరు కొత్త దిశలో ప్రయాణించడానికి ఒక అవకాశం.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe