‘బీకామ్ గ్రాడ్యుయేట్ జీతం కన్నా ఎక్కువ’- నెలకు రూ. 31 లక్షలు సంపాదిస్తున్న మోమోస్ సెల్లర్!
బెంగళూరులో ఓ మోమోస్ సెల్లర్‌కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. సదరు మోమోస్ సెల్లరు నెలకు రూ. 31లక్షలు సంపాదిస్తున్నాడు! ఇది బీకామ్ గ్రాడ్యుయేట్స్ జీతం కన్నా ఎక్కువ అని అంటున్నారు.
బెంగళూరులో వీధి పక్కన మోమోస్ (Momos) విక్రయించే వ్యక్తి ఒక రోజు ఆదాయాన్ని వెల్లడించడం ద్వారా ఒక ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు తెరలేపారు.

క్యాసీ పారెరా అనే కంటెంట్ క్రియేటర్ చేసిన పోస్ట్ ప్రకారం.. ఆ మోమోస్ విక్రేత నెలకు దాదాపు రూ. 31 లక్షలు – అంటే రోజుకు రూ. 1 లక్ష కన్నా ఎక్కువే సంపాదిస్తున్నాడు. ఇది సాధారణ బీకామ్ గ్రాడ్యుయేట్ జీతం కంటే ఎక్కువని అతను పేర్కొన్నాడు.
వీధి పక్కన చిన్న సెటప్‌లో నడుస్తున్నప్పటికీ, కేకే మోమోస్ పేరుతో ఉన్న ఈ స్టాల్ బెంగళూరులో నగరంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ వ్యాపారంతో రోజుకు లక్షల్లో" ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.
స్టాల్ రోజుకు ఎంత సంపాదిస్తుంది?
ఆ స్టాల్ అంత పెద్ద మొత్తాన్ని ఎలా సంపాదించగలుగుతుందో పారెరా తన వీడియోలో వివరించారు. ఆయన ఇలా రాశారు:
“నేను కస్టమర్‌లకు మోమోస్ అందించడం మొదలుపెట్టాను, వారికి అవి బాగా నచ్చాయి. ఈ షాప్ ఎంత ఫేమస్సో చూస్తే నాకు పిచ్చెక్కింది. కేవలం ఒక గంటలో, మేము 118 ప్లేట్ల మోమోస్‌ను విక్రయించాం.. ఒక్కో ప్లేట్ ధర రూ.110. ఈ రోజు మొత్తం మేము సుమారు 950 ప్లేట్లు అమ్మాం!"
అతని పరిశీలనల ఆధారంగా.. ఈ షాప్ రోజుకు సుమారు 950 ప్లేట్లు విక్రయిస్తుంది. ఒక్కో ప్లేట్ ధర రూ. 110 చొప్పున లెక్కేస్తే, ఒకే రోజులో దాదాపు రూ. 1 లక్ష ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం నిరంతర కష్టానికి, ఎక్కువ సమయం పనిచేయడానికి ఫలితమని పారెరా నొక్కి చెప్పారు.
సోషల్ మీడియా స్పందన ఎలా ఉంది?
ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు:
ఒక యూజర్, “నేను సంవత్సరంలో కూడా ఇంత సంపాదించను” అని రాశారు.
మరొకరు, “ఒక్కో ప్లేట్ రూ. 110 పెట్టి కొనేదెవరు?” అని ప్రశ్నించారు.
మూడో వ్యక్తి సరదాగా, “అంబానీకి పోటీ వచ్చిందన్నమాట” అని కామెంట్ చేశారు.
నాలుగో వ్యక్తి, “ఈ రోజుల్లో అందరూ బీకామ్ గ్రాడ్యుయేట్ కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు” అని అభిప్రాయపడ్డారు.
ఐదో యూజర్ ఈ అంకెలను అనుమానిస్తూ, “ఒక గంటలో 118 ప్లేట్ల మోమోస్ అమ్మారా? సీరియస్‌గా?” అని ప్రశ్నించారు.
మరొకరు, “ఇది పూర్తిగా అబద్ధం, రోడ్డు పక్కన మోమోస్ ప్లేట్ రూ. 110 ఉండదు, రోజుకు 900+ ప్లేట్లు అమ్మడం అసాధ్యం” అని రాశారు.
మరొక యూజర్, “అతను పన్ను కడుతున్నాడా?” అని ప్రశ్నించారు.
మరి ఈ వీడియోపై మీరేం అంటారు?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












