బ్రిక్స్ దేశాలపై సుంకాలను పెంచుతామని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్.. రిప్లై ఇచ్చిన చైనా!

బ్రిక్స్ 2025 శిఖరాగ్ర సమావేశం బ్రెజిల్‌లోని రియో​​డిజనీరోలో జరిగింది. ఇందులో భారతదేశంతో సహా సభ్య దేశాలు పాల్గొన్నాయి. అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే ఏ దేశానికైనా 10 శాతం సుంకం విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు. దీనిపై చైనా స్పందించింది.

Published on: Jul 7, 2025, 18:24:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

్రెజిల్‌లోని రియో​​డిజనీరోలో బ్రిక్స్ సదస్సు జరిగింది. భారత ప్రధాని మోదీ సహా సభ్య దేశాల నాయకులు, ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంతో డోనాల్డ్ ట్రంప్ బెదిరింపులు చేశారు. బ్రిక్స్ దేశాల విధానాలకు మద్దతు ఇచ్చే దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని డోనాల్డ్ ట్రంప్ చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (REUTERS)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (REUTERS)

అమెరికన్ వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే దేశాలపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. బ్రెజిల్‌లోని రియో​​డిజనీరోలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో డోనాల్డ్ ట్రంప్ పేరు చెప్పకుండా సుంకాల పెంపును విషయాన్ని బ్రిక్స్ గ్రూప్ ఖండించింది. దీనికి ప్రతిస్పందనగా ఆయన ఈ బెదిరింపు చేశారు. బ్రిక్స్‌లో అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే ఏ దైశానికైనా 10 శాతం టారిఫ్‌లు విధిస్తామని చెప్పారు. ఇప్పుడు దీనిపై చైనా స్పందించింది.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. 'బ్రిక్స్ అంతర్జాతీయ సమాజంలో సానుకూల శక్తి అని మేం విశ్వసిస్తున్నాము. దాని సహకారం బహిరంగంగా, అందరినీ కలుపుకొని ఉంటుంది. ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. సుంకాల విషయానికొస్తే ఎల్లప్పుడూ సుంకాల యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలను వ్యతిరేకిస్తాం. బలవంతం, ఒత్తిడితో సుంకాలను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తాం. సుంకాలను ఏకపక్షంగా విధించడం సరికాదు.' అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి బ్రిక్స్ గ్రూప్ ఒక ముఖ్యమైన వేదిక అని చైనా తెలిపింది. ఇది ఏ దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి ఘర్షణలో పాల్గొనదు లేదా ఏ దేశాన్ని లక్ష్యంగా చేసుకోదని స్పష్టం చేసింది.

బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్ 2025 శిఖరాగ్ర సమావేశానికి బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా సభ్య దేశాలు హాజరయ్యాయి. ఇరాన్ అణు, సైనిక సౌకర్యాలపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ప్రకటన కూడా వెలువడింది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More