విద్యార్థులకు డిజిటల్ స్కిల్లింగ్ కోసం byteXL, సెయింట్ మేరీస్ గ్రూప్ ఒప్పందం
బైట్‌ఎక్స్‌ఎల్ (byteXL), సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) ద్వారా, 11,000 మందికి పైగా ఇంజినీరింగ్ విద్యార్థులకు అత్యాధునిక డిజిటల్ స్కిల్లింగ్, ఉద్యోగానికి సిద్ధం చేసే శిక్షణ లభించనుంది.
సాంకేతికతలో ముందడుగు వేసేందుకు బైట్‌ఎక్స్‌ఎల్, సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో జతకట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత అభ్యాస పరిష్కారాలు అందించే బైట్‌ఎక్స్‌ఎల్, సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో ఒక కీలక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ద్వారా, సుమారు 11,000 మందికి పైగా విద్యార్థులు, ఇందులో 4,000 మందికి పైగా విద్యార్థినులు ఉన్నారు. అత్యాధునిక డిజిటల్ పరిజ్ఞానాన్ని అందుకోనున్నారు. ఇది కేవలం నైపుణ్య శిక్షణా కార్యక్రమం (స్కిల్లింగ్ ప్రోగ్రాం) కాకుండా, కళాశాలను సమగ్రంగా డిజిటల్‌గా మార్చే సంస్థాగత పరివర్తన మోడల్‌గా పనిచేస్తుంది.
తరగతి గదికి టెక్నాలజీ టచ్
సాధారణ స్కిల్లింగ్ కార్యక్రమాలకంటే భిన్నంగా, ఈ భాగస్వామ్యం సంస్థాగత స్థాయిలో పెద్ద మార్పు తీసుకురానుంది. ఇందులో తరగతి గది డిజిటలైజేషన్, అన్ని సెమిస్టర్‌లలో నిరంతర నైపుణ్య శిక్షణ, అలాగే బైట్‌ఎక్స్‌ఎల్ రూపొందించిన ప్రత్యేకమైన bCAP (అకాడమిక్ ఇంటిగ్రేషన్ మోడల్) ద్వారా పాఠ్యాంశాలలో టెక్నాలజీని పూర్తిగా విలీనం చేయడం వంటివి ఉన్నాయి.
విద్యార్థులు పట్టభద్రులయ్యే నాటికి, వారికి బలమైన సాంకేతిక సామర్థ్యం, ఉద్యోగానికి సిద్ధంగా ఉండే నైపుణ్యాలు లభించేలా చూడడమే దీని ప్రధాన లక్ష్యం.
హైదరాబాద్ టెక్ హబ్‌కు అవసరమైన అడుగు
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిజిటల్-కేంద్రీకృత విద్యాసంస్థలు పెరుగుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ దేశంలోనే అగ్రశ్రేణి విద్య, సాంకేతిక హబ్‌లలో ఒకటిగా బలోపేతం అవుతోంది. ఈ సమయంలో, పరిశ్రమకు వెంటనే ఉపయోగపడే (జాబ్-రెడీ) ఇంజినీర్ల డిమాండ్ కూడా పెరుగుతోంది. క్లాస్‌రూమ్ అభ్యాసాన్ని, నగరంలో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఎకానమీకి, సంస్థల అంచనాలకు అనుగుణంగా మార్చడానికి ఈ సహకారం చాలా ముఖ్యం.
ఈ భాగస్వామ్యం గురించి బైట్‌ఎక్స్‌ఎల్ సీఈఓ, సహ వ్యవస్థాపకులు కరుణ్ తాడెేపల్లి మాట్లాడుతూ “మేం ఒక అడుగు ముందుకు వేసి, అభ్యాసానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ, పూర్తి కళాశాల పరివర్తన మోడల్ వైపు పయనిస్తున్నాం. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో మా భాగస్వామ్యం టెక్నాలజీ, ఉద్యోగానికి కావాల్సిన శిక్షణను నేరుగా తరగతి గదిలోకి తీసుకురావడంపై దృష్టి పెడుతుంది. దీనివల్ల విద్యార్థులు వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచంలో ముందుండగలుగుతారు” అని పేర్కొన్నారు.
అలాగే, బైట్‌ఎక్స్‌ఎల్ సీఎస్ఓ, సహ వ్యవస్థాపకులు శ్రీచరణ్ తాడెేపల్లి తమ అభిప్రాయాన్ని పంచుకుంటూ, “విద్యను మరింత సమకాలీనంగా, చురుకుగా, పరిశ్రమకు అనుగుణంగా మార్చాలనే మా ఉమ్మడి నిబద్ధతను ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది. మా అకాడమిక్ ఇంటిగ్రేషన్ మోడల్ ద్వారా, విద్యార్థులు వాస్తవ ప్రపంచ సవాళ్లకు, పరిశ్రమ అంచనాలకు తమ అభ్యాసాన్ని వర్తింపజేయడానికి అవసరమైన నైపుణ్యాలు, ఆలోచనా విధానం, డిజిటల్ సంసిద్ధతను పొందేలా శక్తిమంతులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని వివరించారు.
సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్, డా. రెవ్. కె. వి. కె. రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, “సెయింట్ మేరీస్‌లో, నిజమైన అభ్యాసం పాఠ్యపుస్తకాలకు మించి ఉంటుందని మేము నమ్ముతాం. బైట్‌ఎక్స్‌ఎల్‌తో కలిసి పనిచేయడం వలన, సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, వాస్తవ ప్రపంచ సంసిద్ధతను రోజువారీ విద్యలో విలీనం చేయడం ద్వారా ఆ నమ్మకాన్ని ఆచరణలో పెట్టగలుగుతున్నాం. ఈ సహకారం ఆవిష్కరణలను ప్రేరేపించే, సాంకేతిక ప్రపంచంలో ప్రభావం చూపడానికి మా విద్యార్థులను సిద్ధం చేసే తరగతి గదుల వైపు మార్పును సూచిస్తుంది” అని తెలిపారు.
విద్యార్థినులకు ప్రత్యేక ప్రోత్సాహం
ఈ కీలక కార్యక్రమం హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ గ్రూప్ పరిధిలోని రెండు అటానమస్ కళాశాలలు, ఒక విశ్వవిద్యాలయంతో ప్రారంభమై, గుంటూరులోని రెండు మహిళా కళాశాలలకు కూడా విస్తరించనుంది. మహిళా కళాశాలలను చేర్చడం ద్వారా, సాంకేతిక విద్యలో అవకాశాలను విస్తరించడానికి, సమ్మిళితత్వాన్ని (ఇంక్లూజివిటీ) పెంపొందించడానికి బైట్‌ఎక్స్‌ఎల్ చేస్తున్న ప్రయత్నం స్పష్టమవుతోంది.
ఈ తొలి అడుగు తర్వాత, ఈ గ్రూప్ కింద ఉన్న ఇతర కళాశాలలకు కూడా ఈ మోడల్‌ను విస్తరించాలని బైట్‌ఎక్స్‌ఎల్ యోచిస్తోంది. ప్రాంతీయ ఎడ్‌టెక్ కంపెనీ చేపట్టిన అతిపెద్ద అకాడమిక్-ఇంటిగ్రేషన్ కార్యక్రమాలలో ఇది ఒకటిగా నిలవనుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


