6500ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో వివో కొత్త స్మార్ట్ఫోన్- ధర ఎంతంటే..
50ఎంపీ సెల్ఫీ కెమెరా, 50ఎంపీ రేర్ కెమెరా సెటప్, 6500ఎంఏహెచ్ బ్యాటరీతో వివో సంస్థ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని ఇండియాలోకి తీసుకొచ్చింది. ఈ వివో వీ60 5జీ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వివో ఇండియా మార్కెట్‌లో తన కొత్త కెమెరా ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. దాని పేరు వివో వీ60 5జీ. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, అమోలెడ్ డిస్‌ప్లే, ఐపీ68/ఐపీ69 వాటర్ రెసిస్టెన్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఈ మొబైల్ ధర, ఫీచర్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
వివో వీ60 5జీ స్మార్ట్ఫోన్- ధరలు..
వివో వీ60 5జీ వివిధ వేరియంట్లలో లభిస్తుంది.
- 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్: రూ. 36,999
- 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్: రూ. 38,999
- 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్: రూ. 40,999
- 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్: రూ. 45,999 (టాప్-ఎండ్ మోడల్)
ఈ స్మార్ట్ఫోన్ ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఆగస్ట్ 19 నుంచి వివో అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఇది మిస్ట్ గ్రే, మూన్‌లిట్ బ్లూ, ఆస్పిషియస్ గోల్డ్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్స్ లభిస్తుంది.
వివో వీ60 5జీ స్పెసిఫికేషన్స్..
డిస్‌ప్లే: వివో వీ60 5జీలో 6.77 ఇంచ్ 120హెచ్‌జెడ్ క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 5,000 నిట్స్ వరకు ఉంటుంది. స్క్రీన్ రిజల్యూషన్ 2392x1080 పిక్సెల్స్. ఈ ఫోన్‌కు ఐపీ68, ఐపీ69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు ఉన్నాయి. అంటే, ఇది 1.5 మీటర్ల నీటిలో దాదాపు 80 నిమిషాల వరకు ఉన్నా సమస్య ఉండదు!
ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్: ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 8జీబీ, 12జీబీ, 16జీబీ LPDDR4x ర్యామ్ ఆప్షన్లలో, అలాగే 128జీబీ, 256జీబీ, 512జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది.
కెమెరా: కెమెరా విభాగంలో వివోవీ60 5జీకి జీస్ బ్రాండింగ్ ఉంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 50ఎంపీ టెలిఫొటో లెన్స్, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50ఎంపీ కెమెరా సెన్సార్‌ను అమర్చారు.
బ్యాటరీ & సాఫ్ట్‌వేర్: ఈ ఫోన్‌లో దాని మునుపటి వెర్షన్‌తో పోలిస్తే మెరుగైన 6,500ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 90డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15పై ఈ ఫోన్ పనిచేస్తుంది. వివో ఈ ఫోన్‌కు నాలుగు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది.
మరి ఈ వివో కొత్త స్మార్ట్ఫోన్ వీ60ని మీరు కొంటారా?
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper



