Jantar Mantar Protest Live : పార్లమెంట్​ మార్చ్​లో ఉద్రిక్తత- జంతర్ మంతర్ వద్ద అంబులెన్స్​ కలకలం!

Jantar Mantar Protest Live : నీట్​ యూజీ పరీక్షల అక్రమాలకు నిరసనగా సోనమ్ వాంగ్​చుక్, సీజేపీ సోమవారం తలపెట్టిన పార్లమెంట్ మార్చ్​ నేపథ్యంలో దిల్లీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Summary

Jantar Mantar Protest Live : సోమవారం నుంచి పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. అదే సమయంలో దేశ రాజధాని దిల్లీలో సీజేపీ, సోనమ్ వాంగ్​చుక్ పిలుపునిచ్చిన పార్లమెంట్ మార్చ్​ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దిల్లీలో పరిణామాలపై లైవ్ అప్డేట్స్ కోసం ఈ హెచ్​టీ తెలుగు పేజీని ఫాలో అవ్వండి..

జంతర్ మంతర్ వద్ద పరిస్థితులు..
జంతర్ మంతర్ వద్ద పరిస్థితులు..

Jantar Mantar Protest Live : దేశ రాజధాని దిల్లీలో తీవ్ర ఉత్కంఠ పరిణామాలు నెలకొన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ, సోనమ్ వాంగ్​చుక్​ పిలుపునిచ్చిన పార్లమెంట్​ మార్చ్​ చుట్టూ సర్వత్రా చర్చ జరుతోంది. పార్లమెంట్​ సమావేశాలు ప్రారంభంకానున్న వేళ, నిరసనలపై లైవ్ అప్డేట్స్..

...Read More

Follow all the updates here:
Jul 20, 2026, 14:04:56 IST

అయోధ్య, మణిపూర్ అంశాలపై సభలో రగడ.. 8 కీలక బిల్లులు సిద్ధం చేసిన కేంద్రం

పేపర్ లీకేజీలతో పాటు అయోధ్య రామ్ మందిర్ విరాళాల వ్యవహారం, మణిపూర్ హింసాకాండ, రైతుల సమస్యలపై తక్షణమే చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. మరోవైపు, ఆగస్టు 13 వరకు సాగే ఈ వర్షాకాల సమావేశాల్లో 'వందేమాతరం' గీతానికి చట్టబద్ధమైన రక్షణ, విదేశీ విరాళాల చట్ట సవరణ, ఉన్నత విద్యారంగ సంస్కరణలు సహా 8 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Jul 20, 2026, 14:04:27 IST

Jantar Mantar Protest Live : విపక్షాల హోరుతో రాజ్యసభ వాయిదా.. తొలి గంటలోనే స్థంభించిన సభ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే రాజ్యసభ తీవ్ర గందరగోళానికి గురైంది. పేపర్ లీకేజీలపై దిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న సీజేపీ ప్రతినిధులపై పోలీసుల లాఠీఛార్జీని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా నిరసించారు. "లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం యువత రోడ్లపైకి వస్తే ప్రభుత్వం లాఠీఛార్జీతో వారిని అణచివేసే ప్రయత్నం చేస్తోంది" అని ఖర్గే మండిపడ్డారు. విపక్షాల నినాదాల నడుమ రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.

Jul 20, 2026, 13:39:33 IST

Jantar Mantar Protest Live : విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి.. ఉవ్వెత్తున ఎగిసిపడిన యువత ఆక్రోశం

నేషనల్ మెడికల్ ప్రవేశ పరీక్షల పేపర్ లీక్ కావడంతో దాదాపు 20 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సహా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన విద్యార్థులు దిల్లీ వీధుల్లో "అవినీతి నశించాలి.. పేపర్ లీకేజీలు ఆగాలి" అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

Jul 20, 2026, 13:38:31 IST

జంతర్ మంతర్ వద్ద వేలాది మంది నిరసనకారులు.. దిల్లీలో స్థంభించిన ట్రాఫిక్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే వేలాది మంది యువకులు, విద్యార్థులు దిల్లీకి చేరుకున్నారు. జంతర్ మంతర్ వద్ద ఇప్పటికే 10,000 మందికి పైగా నిరసనకారులు గుమిగూడినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో దిల్లీలోని పలు ప్రధాన రహదారులపై తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది.

Jul 20, 2026, 13:37:48 IST

Jantar Mantar Protest Live : కేంద్ర మంత్రితో సీజేపీ నేతల కీలక చర్చలు

పరీక్షల పేపర్ లీకేజీలపై దిల్లీలో యువత నిరసనలు ఉధృతమైన వేళ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆహ్వానం మేరకు సీజేపీ ముఖ్య ప్రతినిధి సౌరవ్ దాస్ సహా మరో సభ్యుడు కేంద్ర మంత్రితో భేటీకి వెళ్లారు. తమ డిమాండ్ల విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నామని సీజేపీ నాయకులు స్పష్టం చేశారు.

Jul 20, 2026, 13:27:59 IST

Jantar Mantar Protest Live : అంబులెన్స్ కలకలం..

లోపల రోగి లేగి లేని ఒక అంబులెన్స్​ని జంతర్​ మంతర్​ వద్దకు పంపించారని, దాని వల్ల తీవ్ర గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని సీజేపీ ఆరోపించింది.

“ఎమర్జెన్సీ పరిస్థితులు లేని, లోపల అసలు రోగి కూడా లేని అంబులెన్స్​ని జంతర్​ మంతర్​ వద్దకు పంపించారు. దాని వల్ల తృటిలో తొక్కిసలాట జరిగేది. జంతర్ మంతర్ వద్ద గందరగోళం సృష్టించేందుకు ప్రభుత్వం ఇంతకు తెగిస్తుందా? శాంతియుత నిరసనకారులంటే ఎందుకు అంత భయం?” అని సీజేపీ తన ఎక్స్​లో పోస్ట్ చేసింది.

Jul 20, 2026, 13:15:12 IST

Jantar Mantar Protest Live : 'లాఠీఛార్జ్ చేయాల్సిన అవసరం ఏముంది?'

దిల్లీలో తాజా పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. శాంతియుతంగా జరుగుతున్న పార్లమెంట్​ మార్చ్​లో లాఠీలను ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు.

Jul 20, 2026, 12:39:15 IST

Jantar Mantar Protest Live : ఆసుపత్రికి సోనమ్ లేఖ..

సోనమ్ వాంగ్ చుక్ సోమవారం సఫ్దర్ జంగ్ ఆసుపత్రిని తాత్కాలికంగా విడిచిపెట్టడానికి అనుమతించాలని కోరారు. తద్వారా తాను పార్లమెంట్ వైపు 'సంసద్ చలో' మార్చ్ లో చేరుతానని పేర్కొన్నారు. "ఈ రోజు నేను చాలా బాగున్నాను. నా ఆరోగ్య పారామీటర్లు కూడా చాలా సాధారణమైనవిగా కనిపిస్తున్నాయి. అందువల్ల తాత్కాలికంగా అయినా ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లడానికి నన్ను అనుమతించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, తద్వారా నేను పార్లమెంటుకు మార్చ్ - సంసద్ చలో చేరగలను," అని లేఖలో పేర్కొన్నారు.

Jul 20, 2026, 12:23:19 IST

Jantar Mantar Protest Live : జేపీ నడ్డాతో భేటీ!

ఉదయం 11 గంటల 52 నిమిషాలకు సీజేపీ ట్విట్టర్​ నుంచి ఒక సందేశం వచ్చింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డాని కలిసేందుకు వెళుతున్నట్టు సీజేపీ ప్రతినిధులు తెలిపారు.

Jul 20, 2026, 12:04:13 IST

Jantar Mantar Protest Live : మరోసారి లాఠీఛార్జ్!

పార్లమెంట్​ మార్చ్​ మొదలైన వెంటనే నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు మరోసారి పోలీసులు లాఠీఛార్జ్​కి దిగినట్టు వార్తలు వస్తున్నాయి.

Jul 20, 2026, 11:55:07 IST

Jantar Mantar Protest Live : మార్చ్​కు ప్రముఖుల మద్దతు

ఈ భారీ ఆందోళన కేవలం విద్యార్థుల నిరసనగానే కాకుండా, రాజకీయ, సినీ, సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టుకుంటోంది. ఈ ప్రదర్శనలో పాల్గొని విద్యార్థులకు బాసటగా నిలిచిన ప్రముఖుల వివరాలు ఇలా ఉన్నాయి:

చంద్రశేఖర్ ఆజాద్: ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ.

మహువా మోయిత్రా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ.

షబానా అజ్మీ: బాలీవుడ్ దిగ్గజ నటి.

ప్రకాష్ రాజ్: ప్రముఖ బహుభాషా నటుడు.

వీరితో పాటు విపక్ష పార్టీలకు చెందిన అనేక మంది ఎంపీలు సైతం ఇప్పుడు పార్లమెంట్​ మార్చ్​లో పాల్గొనేందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది.

Jul 20, 2026, 11:42:42 IST

Jantar Mantar Protest Live : పార్లమెంట్​కు మార్చ్ సెగ!

పార్లమెంట్ మార్చ్ సెగ ఉభయసభలను తాకేలా కనిపిస్తోంది! నిరసనకారులతో పోలీసులు ప్రవర్తించిన తీరును లోక్​సభ, రాజ్యసభలో లేవనెత్తాలని విపక్షాలు భావిస్తున్నాయి.

Jul 20, 2026, 11:19:35 IST

Jantar Mantar Protest Live : లోక్​సభ వాయిదా..

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన 10 నిమిషాలకే.. లోక్​సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. విపక్షాల నిరసనల మధ్య హోరెత్తిపోయిన సభను స్పీకర్ వాయిదా వేశారు.

Jul 20, 2026, 11:13:29 IST

Jantar Mantar Protest Live : ఇంటర్నెట్ బంద్?

పార్లమెంట్ మార్చ్​ మొదలైన వేళ.. సెంట్రల్​ దిల్లీలోని అనేక ప్రాంతాల్లో అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్టు తెలుస్తోంది.

Jul 20, 2026, 10:58:54 IST

Jantar Mantar Protest Live : ఆప్ సభ్యుల చేరిక

సీజేపీ పార్లమెంట్ మార్చ్ నిరసనల్లో ఆప్​ సభ్యులు పాల్గొన్నారు. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, అతిషి వంటి ప్రముఖులు నిరసనకారులకు మద్దతుగా నిలిచారు.

Jul 20, 2026, 10:54:33 IST

Jantar Mantar Protest Live : ప్రభుత్వంతో సీజేపీ చర్చలు!

సీజేపీ ప్రతినధి సౌరవ్ దాస్​ని డిప్యూటీ కమిషనర్ ఆఫీసుకు తీసుకెళ్లారు. ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్టు ఈ సందర్భంగా ఆయన అన్నారు.

Jul 20, 2026, 10:51:09 IST

CJP Protest in Delhi : పార్లమెంట్ సమావేశాలకు ముందు మోదీ స్పందన..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. మాన్​సూన్, మాన్​సూన్ సెషన్లు సరిగ్గా జరుగుతాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

Jul 20, 2026, 10:46:31 IST

CJP protest in Delhi : నిరసనకారుల మధ్య షబానా అజ్మీ..

జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనకారులకు ప్రముఖ నటి షబనా అజ్మీ మద్దతుతెలిపారు. ఆమె స్వయంగా నిరసన స్థలానికి వెళ్లి సపోర్ట్ ఇచ్చారు.

Jul 20, 2026, 10:29:51 IST

CJP Protest in Delhi : జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..

జంతర్ మంతర్ వద్ద దిల్లీ పోలీసులు- నిరసకారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరం నెలకొంది. పార్లమెంట్ వైపు నడిచేందుకు ప్రయత్నిస్తున్న నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

Jul 20, 2026, 10:24:49 IST

CJP Protest in Delhi : పార్లమెంట్ మార్చ్ మొదలు

సోమవారం ఉదయం దిల్లీలో పార్లమెంట్ మార్చ్ మొదలైంది. అయితే, నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు స్వల్పంగా పనిచెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

Jul 20, 2026, 10:01:01 IST

సోనమ్ వాంగ్​చుక్​ భార్య పిటిషన్

సఫ్దర్ జంగ్ హాస్పిటల్ నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు అనుమతి నిరాకరించిన సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సోనమ్ వాంగ్ చుక్ భార్య గీతాంజలి దిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్​ను ఆశ్రయించారు. ఈ పిటిషన్​ను ఉదయం 10:30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించనున్నారు.

Jul 20, 2026, 09:46:08 IST

నిరసన ప్రాంగణం వద్ద ప్రకాశ్ రాజ్..

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్.. జంతర్ మంతర్​ వద్దకు చేరుకున్నారు. సీజేపీ పార్లమెంట్​ మార్చ్​కు మద్దతు తెలిపారు.

Jul 20, 2026, 09:32:57 IST

సీజేపీ ఫౌండర్ పిలుపు..

“శాంతియుతంగా నిరసనలు చేద్దాము. నిరసనకారులు అందరు గులాబీ పువ్వు, మహాత్మా గాంధీ/ అంబేడ్కర్ ఫొటోను తీసుకురండి. భారత రాజ్యాంగ కాపీని సైతం తీసుకురండి,” అని సీజేపీ ఫౌండర్ దిప్కే పిలుపునిచ్చారు.

Jul 20, 2026, 09:30:29 IST

సీజేపీని సంప్రదించిన కేంద్రం?

పార్లమెంట్​ మార్చ్​కి సరిగ్గా కొద్ది సేపటికి ముందు జంతర్​ మంతర్​ వద్ద నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. నీట్​ పేపర్​ లీక్​కి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో తొలిసారి కేంద్రం తమని సంప్రదించిందని సీజేపీ పార్టీ ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు.

Jul 20, 2026, 09:27:53 IST

రంగంలోకి సోనమ్ వాంగ్​చుక్ భార్య..

సోనమ్ వాంగ్​చుక్ లేని పక్షంలో ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో.. నేడు జరగనున్న పార్లమెంట్​ మార్చ్​ని ముందుండి నడిపించనున్నారు.

Jul 20, 2026, 09:24:51 IST

జంతర్ మంతర్ వద్ద 8వేల మంది నిరసనకారులు

చలో సంసద్​లో పాల్గొనేందుకు జంతర్ మంతర్ వద్దకు 8వేల మంది చేరారను పోలీసులు వెల్లడించారు.

Jul 20, 2026, 09:19:31 IST

మెట్రో స్టేషన్లు బంద్?

నిరసనల వేళ దిల్లీలోని అనేక మెట్రో స్టేషన్లను అధికారులు మూసేశారని సీజేపీ ఆరోపించింది. రాజివ్ చౌక్, జన్​పథ్, పటేల్ చౌక్ మెట్రో స్టేషన్లు మూతపడ్డాయని పేర్కొంది. చలో సంసద్​కు వస్తున్న వారు ఇందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలని చెప్పింది.

Jul 20, 2026, 09:17:46 IST

దిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు..

ఈ 'చలో సంసద్' నిరసన ప్రదర్శన నేపథ్యంలో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా జాతీయ రాజధాని నడిబొడ్డున భారీగా జనసమీకరణను నిషేధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. బీఎన్​ఎస్​ఎస్​లోని సెక్షన్ 163 కింద ఈ నిషేధాజ్ఞలు విధించినట్లు ప్రకటించారు.

Jul 20, 2026, 09:16:52 IST

పార్లమెంట్ మార్చ్ 2026 లైవ్-

దేశ రాజధాని దిల్లీలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల వేళ ఒక్కసారిగా రాజకీయ సంచలనం రేగింది. నీట్-యూజీ పరీక్షల అక్రమాలకు నిరసనగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చింది. కాగా ఈ 'చలో సంసద్' నిరసన ప్రదర్శనకు దిల్లీ పోలీసులు అనుమతులు ఇవ్వలేదు.

Home News Jantar Mantar Protest Live : పార్లమెంట్​ మార్చ్​లో ఉద్రిక్తత- జంతర్ మంతర్ వద్ద అంబులెన్స్​ కలకలం!