...
...
Next Story

తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు.. పదో తరగతి చవిదితే చాలు.. పూర్తి వివరాలు ఇవే

ఇప్పటికే ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతుల్లో డ్రైవర్ల నియామకాన్ని చేపట్టిన తెలంగాణ ఆర్టీసీ.. తాజాగా కండక్టర్లను కూడా అదే విధానంలో నియమించుకునేందుకు చర్యలు ప్రారంభించింది. తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు ఇస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Published on: May 25, 2025, 15:55:43 IST
By
Prefer HTon Google
Advertisement

తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ల కొరత వేధిస్తోంది. దీంతో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్లను నియమించుకునేందుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వయసుండి.. పదో తరగతి విద్యార్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివిధ ఏజెన్సీల ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

రూ.2 లక్షలు డిపాజిట్ చేయాలి..

తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు (unsplash)
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు (unsplash)

ఈ ప్రక్రియలో కండక్టర్లుగా ఎంపికైన వారికి నెలవారీ చెల్లించే కన్సాలిడేటెట్‌ జీతంమొత్తం రూ.17,969గా నిర్ణయించారు. అయితే.. ఏజెన్సీ మాత్రం రూ.2 లక్షల మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో సంస్థకు నష్టం జరిగితే.. దాన్ని ఈ సెక్యూరిటీ డిపాజిట్ నుంచి రికవరీ చేయనున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. వీరికి వర్క్‌మెన్స్‌ కాంపన్సేషన్‌ యాక్ట్‌ వర్తించదని స్పష్టం చేసింది. పీఎఫ్, ఈఎస్‌ఐ లాంటి చట్టబద్ధమైన వెసులుబాట్లు ఉండవని తేల్చి చెప్పింది.

వారం రోజులు శిక్షణ..

కండక్టర్లుగా ఎంపికైన వారికి వారం రోజులు శిక్షణ ఉంటుంది. టీజీఎస్ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజీలో 3 రోజులు, ప్రో కండక్టర్‌గా మూడు రోజులు శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో వసతి, భోజనం కల్పిస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉచితంగా ఉంటుంది. కండక్టర్లుగా ఎంపికైన వారికి కాంట్రాక్టర్ల ద్వారా లైసెన్స్ ఇస్తారు. వీటిని సంస్థ ఉచితంగా అందజేయనుంది.

ఓటీ చేస్తే ఎక్కువ డబ్బులు..

విధుల్లో చేరేముందు ఒరిజినల్ టెన్త్ మెమోను కాంట్రాక్టర్ ద్వారా సంస్థకు అందజేయాలి. వీరికి రెగ్యులర్ కండక్టర్లమాదిరిగానే ఇన్సెంటివ్స్, ఎర్నింగ్స్ క్యాష్ రూపంలో ఇస్తారు. కానీ.. డబుల్ డ్యూటీకి మాత్రం అనుమతి ఇవ్వరు. అలాగే 2 గంటల వరకు ఓవర్ టైన్ డ్యూటీలు వేసే అవకాశం ఉంటుంది. గంట ఓటీ ఉంటే రూ.100, గంట నుంచి 2 గంటలు ఓటీ చేస్తే.. రూ.200 చెల్లిస్తారు.

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల్లో..

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe