అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో నాన్ టీచింగ్ ఖాళీలకు దరఖాస్తు వెలువడింది. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

Updated on: Jul 15, 2025, 17:09:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మీకు సెంట్రల్ యూనివర్సిటీలో పని చేయాలనే ఆసక్తి ఉందా? అయితే మీ కోసం నాన్ టీచింగ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ వెలువడింది. అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెుత్తం 19 ఖాళీలు ఉన్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం..

ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులు
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులు

ఖాళీల వివరాలు

డాక్టర్ -2, డేటా ఎంట్రీ ఆపరేటర్-2, అకౌంటెంట్-1, అసిస్టెంట్-1, ల్యాబ్ అసిస్టెంట్(కంప్యూటర్ ల్యాబ్)-4, ల్యాబ్ అసిస్టెంట్(జాగ్రఫీ అండ్ స్పెస్ సైన్స్)-1, హాస్టల్ కేర్ టేకర్(బాయ్స్ అండ్ గర్ల్స్)-4, నర్స్-1, హిందీ ట్రాన్స్‌లేటర్ కమ్ టైపిస్ట్-1, టెక్నికల్ అసిస్టెంట్(డేటా సెంటర్)-1, ప్లంబర్-1.

అర్హతలు

పైన చెప్పిన పోస్టులకు వివిధ విద్యార్హతలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లోమా, డిగ్రీ, జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్/ ఎంఎస్సీ నర్సింగ్, ఇంజినీరింగ్/బీఏ/ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఈ, బీకాం/ఎంకాం, ఎంబీబీఎస్, ఎండీ ఉత్తీర్ణతతోపాటుగా ఉద్యోగంలో అనుభం కూడా ఉండాలి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More