Cars discounts : జీఎస్టీ తగ్గింపుతో పాటు పండుగ డిస్కౌంట్లు- అతి తక్కువ ధరకు కియా బెస్ట్​ సెల్లింగ్​ కార్లు..

కార్ల కొనుగోలుకు ఇదే సరైన సమయం! తమ కార్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది ఆటోమొబైల్​ సంస్థ. రూ. 1.60 లక్షల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 14, 2025, 05:37:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలో పండుగ సీజన్​ సందడి కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్​ రంగంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయులు సొంత వాహనాలను కొనేందుకు ఎగబడుతున్నారు. అదే సమయంలో ఈ సీజన్‌ను సొమ్ము చేసుకోవడానికి, కార్ల తయారీదారులు తమ అమ్మకాలను పెంచుకునేందుకు చురుకుగా పనిచేస్తున్నారు. జీఎస్టీ తగ్గింపుతో పాటు తమ బెస్ట్​ సెల్లింగ్​ వాహనాలపై వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి కియా మోటార్స్​ సైతం చేసింది. తన ప్రసిద్ధ మోడళ్లైన సైరోస్, సోనెట్, సెల్టోస్ సహా ఇతర కార్లపై రూ. 1.60 లక్షల వరకు ప్రయోజనాలను ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కియా సైరోస్​..
కియా సైరోస్​..

ఈ కియా వాహనాలపై పండుగ డిస్కౌంట్లు..

కియా సోనెట్..

కియా సోనెట్ కారుపై దీపావళి ఆఫర్ల కింద మొత్తం రూ. 1,02,700 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. సోనెట్ ధరలు రూ. 7,30,138 నుంచి ప్రారంభమవుతాయి.

కియా సైరోస్​..

కియా సైరోస్ ఎస్​యూవీలో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 118 బీహెచ్‌పీ పవర్​ని, 172 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్​ కూడా ఉంది. ఈ డీజిల్ ఇంజిన్ 113 హెచ్‌పీ పవర్​ని, 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇక ట్రాన్స్‌మిషన్ ఎంపికల విషయానికి వస్తే, ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 7-స్పీడ్ డీసీటీ, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటివి ఉన్నాయి.

ఈ పండుగ సీజన్ ఆఫర్‌లో, కియా సైరోస్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు రూ. 1,60,400 వరకు ప్రయోజనాలను పొందవచ్చు! సైరోస్ ధరలు రూ. 8.67 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతాయి.

కియా సెల్టోస్..

హుండాయ్ క్రెటాకు గట్టి పోటీ ఇచ్చే కియా సెల్టోస్ కారు, ఈ పండుగ ఆఫర్‌తో మరింత ఆకర్షణీయంగా మారింది. సెల్టోస్ కొనుగోలుపై రూ. 1.47 లక్షల వరకు ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది. కియా సెల్టోస్ ధరలు రూ. 10.79 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.

కియా క్యారెన్స్..

కియా క్యారెన్స్ మోడల్‌పై పండుగ ఆఫర్ల కింద రూ. 83,200 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ కారు ప్రారంభ ధర రూ. 10.47 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కియా క్యారెన్స్ క్లావిస్..

ఇటీవల విడుదలైన కియా క్యారెన్స్ క్లావిస్ కారు ప్రారంభ ధర రూ. 11.18 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అయితే, రూ. 1,41,800 వరకు లభించే పండుగ ప్రయోజనాలతో, ఈ ఎస్‌యూవీ ధర కొంచెం తగ్గుతుంది, కొనుగోలుదారులకు మరింత తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది.

మరింత సమాచారం కోసం, ఈ ఆఫర్లు, ధరల వివరాలను తెలుసుకోవడానికి మీరు నేరుగా కియా డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More