...
...
Next Story

8.8 తీవ్రతతో అతి భారీ భూకంపం- సునామీ హెచ్చరికలు జారీ..

రష్యా కంచెట్కా ద్వీపకల్పం వెంబడి ఉన్న పెసిఫిక్​ మహా సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రికార్ట్​ స్కేల్​పై దీని తీవ్రత 8.8గా నమోదైంది. ఈ నేపథ్యంలో హవాయిలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Published on: Jul 30, 2025, 06:01:00 IST
By ,
Prefer HTon Google
Advertisement

రష్యా కంచెట్కా ద్వీపకల్పం వెంబడి ఉన్న పసిఫిక్​ మహా సముద్రంలో అత్యంత శక్తివంతమైన, 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని యూఎస్​ జియోలాజికల్​ సర్వే ధ్రువీకరించింది. భూకంపం పర్యవసానంగా హువాయి సహా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేశారు.

రష్యాలో భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు..

రష్యా తూర్పు తీరన భారీ భూకంపం..
రష్యా తూర్పు తీరన భారీ భూకంపం..

యూఎస్​జీఎస్​ ప్రకారం.. రష్యాలోని కంచెట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్ నుంచి మరింత తూర్పున 85 మైళ్లు (136 కిలోమీటర్లు) దూరంలో, 12 మైళ్ల (19 కిలోమీటర్లు) లోతులో భూకంప కేంద్రం ఉంది.

రష్యా భూకంపం తీవ్రత తొలుత 8.0 అని వెల్లడించిన అధికారులు.. అనంతరం దానిని 8.7కి అప్​గ్రేడ్​ చేశారు. ఆ తర్వాత మళ్లీ 8.8కి మార్చారు.

మరోవైపు రష్యాలో భూకంపంఅనంతరం అమెరికన్ అధికారులు అలస్కా వంటి ప్రాంతాలకు సైతం సునామీ అడ్వైజరీని జారీ చేశారు. జపాన్​ ఉత్తర భాగం నుంచి 250 కి.మీ దూరంలో ఈ భూకంపం సంభవించడంతో ఆ దేశంతో పాటు సైపాన్​, రోటా, టినియన్​, గువామ్​, సమీప ద్వీపాలు అప్రమత్తమయ్యాయి.

8.0 తీవ్రతతో సంభవించే భూకంపాలు చాలా శక్తివంతమైనవిగా పరిగణిస్తారు. భూకంప కేంద్రానికి సమీపంలోని ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు. కానీ ఈ భూకంపం సముద్రంలో సంభవించినందున సునామీప్రమాదం ఏర్పడింది. దీని ప్రభావం పసిఫిక్ మహాసముద్రంలోని తీరప్రాంతాలపై ఉంటుందని అంచనా.

రష్యా భూభాగంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది. కానీ భూకంపం ధాటికి తీర ప్రాంతాల వెంబడి భవనాలు షేక్​ అవుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

రష్యాలోని కంచెట్కా ద్వీపకల్పం తీరంలో సంభవించిన క్తివంతమైన భూకంపం తర్వాత హవాయికి సునామీ వాచ్ జారీ చేశారు.

యూఎస్​ సునామీ వార్నింగ్ సిస్టమ్ తెలిపిన వివరాల ప్రకారం.. "అందుబాటులో ఉన్న అన్ని డేటా ఆధారంగా, ఈ భూకంపం వల్ల సునామీ ఏర్పడే అవకాశం ఉంది. ఇది భూకంప కేంద్రానికి దూరంగా ఉన్న తీర ప్రాంతాల్లో కూడా విధ్వంసంసృష్టించగలదు. హవాయికి సునామీ ముప్పు ఉందా లేదా అని నిర్ధారించడానికి పరిశోధన జరుగుతోంది,"

హవాయి అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూర్తి సమాచారం వచ్చేవరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యే అవకాశం ఉంది.

అమెరికాలోని ఈ ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు..

దక్షిణ అలస్కా, అలస్కా ద్వీపకల్పం: చిగ్నిక్ బే నుంచి ఉనిమాక్ పాస్ వరకు

అలూషియన్ దీవులు: ఉనిమాక్ పాస్ నుండి సమల్గా పాస్ వరకు

కాలిఫోర్నియా: మెక్సికో సరిహద్దు నుంచి ఒరెగాన్ సరిహద్దు వరకు గల తీరం, శాన్ ఫ్రాన్సిస్కో బేతో సహా!

ఒరెగాన్: కాలిఫోర్నియా సరిహద్దు నుంచి వాషింగ్టన్ సరిహద్దు వరకు గల తీరం, కొలంబియా నది ముఖద్వారంతో సహా.

వాషింగ్టన్: ఔటర్ కోస్ట్ నుంచి స్లిప్ పాయింట్ వరకు, కొలంబియా నది ముఖద్వారం, జువాన్ డి ఫ్యూకా స్ట్రెయిట్‌తో సహా.

బ్రిటిష్ కొలంబియా: నార్త్ కోస్ట్, హైడా గ్వాయ్, వాంకోవర్ ఐలండ్, జువాన్ డి ఫ్యూకా స్ట్రెయిట్.

ఆగ్నేయ అలస్కా: బ్రిటిష్కొలంబియా సరిహద్దు నుంచి కేప్ ఫెయిర్‌వెదర్ వరకు.

దక్షిణ అలస్కా, అలస్కా ద్వీపకల్పం: కేప్ ఫెయిర్‌వెదర్ నుండి చిగ్నిక్ బే వరకు.

ఈ ప్రాంతాల ప్రజలు స్థానిక అధికారుల నుంచి వచ్చే హెచ్చరికలను, సూచనలను నిశితంగా పర్యవేక్షించాలి. అనవసరంగా తీర ప్రాంతాలకు వెళ్లడం, సముద్ర కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి మానుకోవాలి. సునామీ వాచ్ అంటే సునామీ రావచ్చని, కానీ అది ఎంత తీవ్రంగా ఉంటుందో లేదా కచ్చితంగా వస్తుందో లేదో ఇంకా నిర్ధారించలేదని గమనించాలి. తదుపరి సమాచారం కోసం అధికారిక వనరులను మాత్రమే నమ్మాలి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks