బెన్ స్టోక్స్‌కు తీవ్ర గాయాలు.. ముఖం నిండా రక్తం.. కంటి కింద కూడా దెబ్బ.. ఫన్నీ కామెంట్‌తో ఫొటో షేర్ చేసిన క్రికెటర్
ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముఖం నిండా గాయాలతో ఉన్న ఫొటోను షేర్ చేసి అభిమానులను ఆందోళనకు గురిచేశాడు. ప్రాక్టీస్ సమయంలో బంతి బలంగా తాకడంతో అతని ముఖం కమిలిపోయింది. అయితే ఈ సీరియస్ గాయాన్ని కూడా అతడు ఫన్నీ కామెంట్ తో సరదాగా మార్చేయడం విశేషం.
మైదానంలో దూకుడుగా ఆడే ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటాడు. గురువారం (ఫిబ్రవరి 5) అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫొటో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ట్రైనింగ్ సమయంలో క్రికెట్ బంతి బలంగా తాకడంతో స్టోక్స్ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి.

"నా సంగతి సరే.. ఆ బంతిని చూడాలి మీరు"
షేర్ చేసిన ఫొటోలో.. బెన్ స్టోక్స్ కుడి కంటి కింద కమిలిపోయి వాచిపోవడాన్ని చూడవచ్చు. చెంపపై కోసుకుపోయిన గాయం, రక్తం కారకుండా ముక్కులో దూది పెట్టుకుని అతడు కనిపిస్తున్నాడు. ఇంతటి నొప్పిలోనూ అతడు తన సెన్సాఫ్ హ్యూమర్‌ను వదులుకోలేదు. "నా ముఖం ఇలా ఉంది సరే.. ఆ క్రికెట్ బంతి పరిస్థితిని మీరు చూడాలి" అంటూ నవ్వుతున్న ఎమోజీతో క్యాప్షన్ రాసుకొచ్చాడు.
వరుస గాయాలు.. ఫామ్ లేమి
బెన్ స్టోక్స్ గాయపడటం ఇంగ్లాండ్ అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నా.. అతడు తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టడం కాస్త ఊరటనిస్తోంది. అయితే గత కొంతకాలంగా స్టోక్స్ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు.
జనవరి ఆరంభంలో సిడ్నీలో జరిగిన ఐదో యాషెస్ టెస్టులో ‘అడక్టర్’ గాయం అతన్ని ఇబ్బంది పెట్టింది. ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్ 1-4 తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఇక 2024లో రెండుసార్లు హ్యామ్‌స్ట్రింగ్ గాయాలు, భుజం గాయం కారణంగా భారత్‌తో జరిగిన కీలక సిరీస్‌కు దూరమయ్యాడు. అంతకుముందు మోకాలి శస్త్రచికిత్స కూడా జరిగింది.
విమర్శలు ఉన్నా.. తగ్గేదేలే..
యాషెస్ ఓటమి తర్వాత స్టోక్స్, కోచ్ మెక్‌కల్లమ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగేందుకే స్టోక్స్ మొగ్గు చూపాడు. వచ్చే సమ్మర్ వరకు అతనికి కెప్టెన్‌గా కాంట్రాక్ట్ ఉంది.
ప్రస్తుత గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. మే నెల చివర్లో న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ ద్వారా స్టోక్స్ మళ్లీ మైదానంలోకి దిగే అవకాశం ఉంది. అలాగే వచ్చే నెలలో జరిగే 'ది హండ్రెడ్' (The Hundred) లీగ్ వేలానికి దూరంగా ఉంటూ, పూర్తిగా టెస్ట్ క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


