చదువు ఫ్రీ- నెలకు రూ. 1లక్షకుపైగా స్టైఫండ్.. ఈ స్కాలర్‌షిప్‌తో మీ ‘విదేశీ విద్య’ కలను నెరవేర్చుకోండి!
విదేశాల్లో చదువుకోవాలన్న కల మీ ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులతో ఆగిపోకూడదు! అందుకే మీరు ఈ ఎరాస్మస్+ స్కాలర్‌షిప్ గురించి తెలుసుకోవాలి. దీని ద్వారా మీరు ఎలాంటి ట్యూషన్ ఫీజు లేకుండా, స్టైఫండ్‌తో చదువుకోవచ్చు. పూర్తి వివరాలు..
అంతర్జాతీయ విద్యను అభ్యసించాలని కలలు కనే భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్!. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా యూరోపియన్ యూనియన్ ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఎరాస్మస్+ (Erasmus+) అనే స్కాలర్‌షిప్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఇప్పుడు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థలున్న 19 యూరోపియన్ దేశాల్లో ట్యూషన్ ఫీజు లేకుండా చదువుకోవచ్చు! కొన్ని సందర్భాల్లో వీసా, ప్రయాణం, వసతి, బీమా వంటి అదనపు గ్రాంట్‌లతో పాటు నెలకు 1,400 యూరోలు (సుమారు ₹1.4 లక్షలు) వరకు స్టైపెండ్‌ను కూడా పొందే అవకాశం ఉంది.

ఎరాస్మస్+ అంటే ఏంటి?
ఈ ప్రోగ్రామ్ యూరోపియన్ యూనియన్ ఫ్లాగ్షిప్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ పథకంలో భాగం. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు అంతర్జాతీయ అనుభవాన్ని, అద్భుతమైన విద్యా అవకాశాలను, సాంస్కృతిక బదిలీని అందించడం దీని లక్ష్యం. భారతదేశం కూడా ఈ భాగస్వామ్య దేశాలలో ఒకటి కావడంతో.. భారతీయ విద్యార్థులు ఎరాస్మస్+ కింద అండర్ గ్రాడ్యుయేట్, పూర్తిస్థాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఈ ఎరాస్మస్+ కోసం ఇటీవలే ఎంపికైన వారిలో 101 మంది భారతీయ విద్యార్థులు రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు స్కాలర్‌షిప్‌లు అందుకున్నారు. వీరిలో 50 మంది మహిళలు ఉండటం, అంతర్జాతీయ విద్యలో లింగ సమతుల్యత మరియు సమ్మిళితత్వంపై బలమైన దృష్టిని సూచిస్తుంది.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఎరాస్మస్+ స్కాలర్‌షిప్‌కు అర్హత పొందడానికి:
- దరఖాస్తుదారు భాగస్వామ్య దేశం (ఇందులో భారతదేశం ఒకటి) నుంచి అయి ఉండాలి.
- అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తుదారులు కనీసం 1-2 సంవత్సరాల కాలేజీ విద్య పూర్తి చేసి ఉండాలి.
- పోస్ట్ గ్రాడ్యుయేట్దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
- ఇంగ్లీష్ ప్రావీణ్యం తప్పనిసరి. చాలా ప్రోగ్రామ్‌లకు IELTS (6.5-7.0 బ్యాండ్), TOEFL (90+ స్కోరు) లేదా ఇతర ఆమోదించిన భాషా పరీక్ష స్కోర్‌లు అవసరం.
- మీ భారతీయ విశ్వవిద్యాలయం ఎరాస్మస్+ తో మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎంఓయూ) కలిగి ఉండాలి. నామినేషన్లు విశ్వవిద్యాలయం నియమించిన ఎరాస్మస్+ కోఆర్డినేటర్ ద్వారా జరగాలి.
ఎరాస్మస్+ ప్రోగ్రామ్.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ ప్రక్రియ మీ సొంత విశ్వవిద్యాలయంలోని ఎరాస్మస్+ కోఆర్డినేటర్‌ను సంప్రదించడంతో ప్రారంభమవుతుంది. దరఖాస్తులు సాధారణంగా ఆన్లైన్లో సమర్పించాలి. అకాడమిక్ మెరిట్, భాషా నైపుణ్యాలు, ఇంటర్వ్యూలలోని పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎరాస్మస్+ ప్రోగ్రామ్‌కి చెందిన దరఖాస్తులు ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ప్రారంభమవుతాయి. అయితే నిర్దిష్ట విశ్వవిద్యాలయం- కోర్సు ఆధారంగా గడువులు మారవచ్చు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper



