టూ వీలర్స్ మీద టోల్ వసూలు ఆలోచన లేదు.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా క్లారిటీ
మరికొన్ని రోజుల్లో ద్విచక్ర వాహనాలకు సైతం టోల్ ఫీజులు వసూలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. దీనిపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) క్లారిటీ ఇచ్చింది.
జులై 15 నుంచి భారతదేశంలోని ద్విచక్ర వాహనాలు హైవేలపై టోల్ చెల్లించాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. ఎంతో కాలంగా ఫ్రీగా వెళ్తున్న మినహాయింపు టూ వీలర్స్‌కు ఉండదని వార్తలు వచ్చాయి. దీనిపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పందించింది. ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజును ప్రవేశపెట్టడం లేదని, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేశాయని పేర్కొంది.

జూలై 15, 2025 నుండి ద్విచక్ర వాహనాలు హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద టోల్ ఫీజు ఉంటుందని ప్రచారం జరిగింది. FASTag ద్వారా డిజిటల్ టోల్ వసూలు వ్యవస్థ పరిధిలోకి ద్విచక్ర వాహనాలను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రధాన మార్పును తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటోందని వార్తలు వచ్చాయి.
అంతేకాదు ఇప్పుడు FASTag ద్వారా టోల్ వసులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోందని కూడా చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి అధికారికంగా ప్రభుత్వ నోటిఫికేషన్ ఏది ఇవ్వలేదు. ద్విచక్ర వాహన యజమానులు ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాల్సి ఉంటుందని, దానిని వారి బ్యాంక్ ఖాతా లేదా డిజిటల్ వాలెట్‌కు లింక్ చేయాలని ప్రచారం చేశారు. కానీ ఈ విషయాలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖండించింది.
'కొన్ని మీడియా సంస్థలు ద్విచక్రవాహనాలకు టోల్ ఫీజు వసూలు చేయనున్నట్టుగా వార్తలు పబ్లిష్ చేశాయి. టూ వీలర్స్ మీద టోల్ వసూలు చేసే ఆలోచన లేదు. అలాంటి ప్రతిపాదన ఏది జరగలేదు. ద్విచక్ర వాహనాలకు టోల్ ఛార్జీలు వసూలు లేదు.' అని NHAI చెప్పింది.
నిజానికి మాన్యువల్ టోల్ వసూలు స్థానంలో డిజిటల్ వ్యవస్థలు రావడంతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గడంతో ప్రయాణం సులభతరం అయిందనే చెప్పాలి. ఇటీవలే పెద్ద వాహనాలకు వార్షిక టోల్ పాస్ రూ. 3,000గా తీసుకువచ్చారు. ఈ స్కీమ్ ద్వారా వాహనదారులకు కొన్ని ప్రయోజనాలు దక్కనున్నాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper



