జూన్ 16 : రూ. 1లక్ష పైనే బంగారం ధర! తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లు ఇలా..
దేశంలో బంగారం ధరలు రూ.1లక్ష పైనే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో నేటి బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ చూసేయండి..
దేశంలో బంగారం ధరలు జూన్ 16, సోమవారం స్వల్పంగా పడినప్పటికీ హైల్ టైమ్ హై వద్దే కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో 10గ్రాముల పసిడి(24క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 1,01,843కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 10,184గా ఉంది.

మరోవైపు దిల్లీలో 22 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 93,363గా కొనసాగుతోంది. అదే సమయంలో 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 9,363 ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 93,325గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,705గా ఉంది. ముంబైలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 93,227 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 1,01,707గా ఉంది.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 93,221గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,01,701గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 93,215గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 1,01,880గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 93,398గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,01,709గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 93,235గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,01,715గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 93,237గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,01,717గా ఉంది.
అహ్మదాబాద్‌లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 93,281గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 1,01,761గా కొనసాగుతోంది. భువనేశ్వర్‌లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 93,220గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,01,700గా ఉంది.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, ఫెడ్ వడ్డీ రేట్లు, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు సోమవారం పడ్డాయి. దిల్లీలో ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 11,300గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. రూ. 1,13,000గా కొనసాగుతోంది.
కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 1,23,200 పలుకుతోంది. విజయవాడలో రూ. 1,23,200గా ఉంది. వెండి ధరలు విజయవాడలో రూ. 1,24,000.. వైజాగ్‌లో రూ. 1,21,600గా ఉంది.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper



