పండుగ కళ అంతా మీదే! ఈ ప్రాంప్ట్​లతో దీపావళి ఏఐ ఫోటోలు క్రియేట్​ చేసుకోండి..

దీపావళి వచ్చేస్తోంది! మరి మీరు కూడా మీకు నచ్చిన విధంగా ఫెస్టివల్​ ఏఐ ఇమేజ్​ను క్రియేట్​ చేసుకుని, మీ స్నేహితులతో పంచుకోవాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. గూగుల్​ జెమినీని ఉపయోగించి ఏఐ ఇమేజ్​లు తయారు చేసుకునేందుకు మీకు కావాల్సిన ప్రాంప్ట్​లను కింద ఇచ్చాము. చూసేయండి..

Published on: Oct 19, 2025, 14:00:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కాంతుల పండుగ దీపావళి వచ్చేస్తోంది! దీపాలు, అలంకరణలు, రంగోళీలతో పండుగ వాతావరణం ఉల్లాసంగా, హాయిగా జరుపుకునేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. చల్లని చలిగాలులు, దీపావళి స్ఫూర్తితో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంప్రదాయాలను జరుపుకోవడానికి ఇదే సరైన సమయం. అయితే, ఈ వేడుకలకు ఆధునిక శైలిని జోడించడానికి, మీరు సాంప్రదాయ దుస్తుల్లో, దీపాలు, టపాసులు, రంగోళీలతో కూడిన అద్భుతమైన దీపావళి ఏఐ పోర్ట్రెయిట్‌లను సృష్టించుకోవచ్చు. ఈ దీపావళికి మీరు ఇలాంటి ఏఐ ఫోటోలను తయారు చేసుకోవాలనుకుంటే, గూగుల్​ జెమినీని ఉపయోగించి ఇక్కడ ఇచ్చిన స్టెప్-బై-స్టెప్ గైడ్‌ను ఫాలో అవ్వండి..

ఏఐ ఫొటో..
ఏఐ ఫొటో..

ఏఐ దీపావళి పోర్ట్రెయిట్‌లను ఎలా క్రియేట్​ చేయాలి?

స్టెప్ 1: జెమినీ ఏఐ యాప్/వెబ్‌సైట్ తెరవండి..

మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో గూగుల్ అందించే జెమినీ ఏఐ యాప్‌ను లేదా వెబ్‌సైట్‌ను తెరవండి. (మీరు ఫోన్లలో జెమిని యాప్‌ని లేదా బ్రౌజర్‌లో వెబ్‌సైట్‌ని ఉపయోగించవచ్చు).

స్టెప్ 2: మీ ఫోటోను అప్‌లోడ్ చేయండి

అధిక రిజల్యూషన్ ఉన్న మీ ఒక ఫోటోను అప్‌లోడ్ చేయండి. ఏఐ మీ రూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి స్పష్టమైన ఫోటోను ఎంచుకోండి.

స్టెప్ 3: ఏఐ ప్రాంప్ట్ సిద్ధం చేయండి

ఇప్పుడు, మీకు కావాల్సిన ఏఐ దీపావళి పోర్ట్రెయిట్‌ల కోసం ఒక ప్రాంప్ట్‌ను రాయండి. ఈ ప్రాంప్ట్‌లో కింది వివరాలను స్పష్టంగా పేర్కొనండి:

మీరు ధరించాలనుకుంటున్న దుస్తులు: సూట్, చీర , లెహెంగా వంటి సాంప్రదాయ దుస్తులను స్పష్టంగా తెలపండి.

యాక్సెసరీస్ (అలంకరణలు): ఆభరణాలు, హెయిర్‌స్టైల్ వంటి వివరాలను జోడించండి.

పండుగ నేపథ్యం: వెచ్చని కాంతుల, దీపాలు, టపాసులు, రంగోళీ, అందమైన అలంకరణ వంటి పండుగ వాతావరణాన్ని వివరించండి.

మీకు ఉపయోగపడే ప్రాంప్ట్​లను కింద ఇచ్చాము చెక్​ చేయండి.

స్టెప్ 4: ఇమేజ్‌ను రూపొందించండి

గూగుల్​ జెమినీలో మీరు ప్రాంప్ట్‌ను సిద్ధం చేసిన తర్వాత, సెండ్ బటన్‌పై క్లిక్ చేయండి. వెంటనే, మీ కోసం ఏఐ పోర్ట్రెయిట్‌ను విజువలైజ్ చేయడం ప్రారంభిస్తుంది.

స్టెప్ 5: మెరుగుపరచండి

ఫోటో వచ్చిన తర్వాత, ఏఐ పోర్ట్రెయిట్‌ను ఒకసారి సమీక్షించండి. మరింత నాణ్యతగా, బ్యూటిఫికేషన్​ అవసరమైతే, మీరు ప్రాంప్ట్‌లో మార్పులు చేసి, దాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు.

దీపావళి 2025- ఈ ఏఐ ప్రాంప్ట్​లు మీకోసమే..

Prompt 1: Create a realistic, 4K image, transforming the uploaded women in photos into a serene and focused expression. She is kneeling to light a diya within a detailed, circular rangoli. She wears a beautiful royal blue-colored lehenga with intricate silver embroidery. The setting is an outdoor balcony decorated with marigold garlands and fairy lights. The scene is illuminated by the soft, golden light of many diyas, emphasising a moment of tranquillity and devotion.

Prompt 2: Transform the woman in the image into a glamorous, designer-inspired portrait standing on a balcony decorated with rangoli and diyas. She is wearing a gold-embroidered outfit in the style of designer Manish Malhotra. She holds a lamp, with soft fireworks gently lighting up the sky in the background. The portrait should feature cinematic lighting and a luxurious, dreamy aesthetic.

Prompt 3: Transform the image into a vibrant, ultra-realistic portrait of the person in the uploaded image, holding a sparkling firecracker (phooljhadi) on a balcony overlooking a city skyline. The night sky is filled with fireworks, and the warm, festive glow from the sparkler lights up their joyful expression. The background features bokeh effects from distant city lights and fireworks.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More