ITR filing last date : ఐటీఆర్​ ఫైలింగ్​ గడువును పొడిగించారా? ఆదాయపు పన్నుశాఖ నుంచి బిగ్​ అప్డేట్​..

ఐటీఆర్​ ఫైలింగ్​ గడువును కేంద్రం పొడిగించిందంటూ సోషల్​ మీడియాలో ఒక పోస్ట్​ వైరల్​గా మారింది. ఇందులో నిజమెంత? దీనిపై ఆదాయపు పన్నుశాఖ స్పందించింది.

Updated on: Sep 15, 2025, 12:23:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్‌లు) దాఖలు చేయడానికి గడువు సెప్టెంబర్ 15 తర్వాత పొడిగించే ప్రసక్తే లేదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ.. "ఐటీఆర్‌ ఫైలింగ్​కి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025గానే ఉంది," అని తెలిపింది.

ఐటీఆర్​ ఫైలింగ్​ గడువును పొడిగించారా? (Reuters/Representational Image)
ఐటీఆర్​ ఫైలింగ్​ గడువును పొడిగించారా? (Reuters/Representational Image)

గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారనేది ఫేక్​ న్యూస్​ అని క్లారిఫై చేస్తూ, ఆదాయపు పన్ను శాఖ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

"వాస్తవానికి జులై 31, 2025న ముగియాల్సిన ఐటీఆర్​ ఫైలింగ్​ గడువును సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించారు. ఇప్పుడు దీనిని సెప్టెంబర్ 30 వరకు పొడిగించారని తప్పుడు మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతున్నాయి," అని ఐటీ శాఖ పేర్కొంది.

సమయానికి సంబంధించిన అప్‌డేట్‌ల కోసం అధికారిక 'ఇన్​కమ్​ ట్యాక్స్​ ఇండియా' ఖాతాను మాత్రమే నమ్మాలని పన్ను చెల్లింపుదారులకు సూచించింది. ఏవైనా సందేహాలు లేదా సేవలు అవసరమైతే, 24/7 పనిచేసే హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని కోరింది.

"కాల్స్, లైవ్ చాట్స్, వెబ్‌ఎక్స్ సెషన్‌లు, ట్విట్టర్/ఎక్స్ ద్వారా మేము సహాయం అందిస్తున్నాం," అని ఆ పోస్ట్‌లో వివరించింది.

ఫేక్​ న్యూస్​లో ఉన్న నోటీసులో ఏముంది?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఐటీఆర్‌ దాఖలుగడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించిందని పేర్కొంటూ ఒక ఫేక్​ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిస్టమ్ సంసిద్ధత, వాటాదారుల ఆందోళనలను ఈ పొడిగింపునకు కారణాలుగా ఆ నకిలీ నోటీసు పేర్కొంది.

గతంలో, పోర్టల్​లో సాంకేతిక సమస్యలు, డేటా సరిపోలకపోవడం వంటి పలు సమస్యలు రావడంతో ఐటీఆర్‌ గడువును జులై 31 నుంచి సెప్టెంబర్ 15కి పొడిగించారు.

శనివారం ఐటీ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. అసెస్‌మెంట్ ఇయర్ 2025-26కి ఇప్పటికే 6 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ఈ మైలురాయిని చేరుకోవడానికి సహకరించిన పన్ను చెల్లింపుదారులకు, పన్ను నిపుణులకు ఎక్స్ పోస్ట్‌లో కృతజ్ఞతలు తెలిపింది.

"పన్ను చెల్లింపుదారులు, పన్ను నిపుణుల సహాయంతో 6 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్‌లు) మైలురాయిని చేరుకున్నందుకు ధన్యవాదాలు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. అసెస్‌మెంట్ ఇయర్ 2025-26కు ఇంకా ఐటీఆర్‌ దాఖలు చేయని వారంతా చివరి నిమిషం హడావుడిని నివారించడానికి వీలైనంత త్వరగా దాఖలు చేయండి. ఈ స్ఫూర్తిని కొనసాగిద్దాం!" అని ఆ పోస్ట్‌లో పేర్కొంది.

ఐటీఆర్‌ దాఖలు చేయడానికి సోమవారం చివరి రోజు కావడంతో, గడువులోగా రిటర్న్స్ దాఖలు చేసి, జరిమానాలను నివారించాలని ఐటీ శాఖ పన్ను చెల్లింపుదారులకు పదేపదే గుర్తు చేస్తోంది.

ఐటీఆర్​ ఎలా ఫైల్​ చేయాలి? అని తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More