బాసర ఐఐఐటీలో ప్రవేశాలు - విద్యార్థుల ఎంపిక విధానం ఇలా ఉంటుంది..!

బాసర ఐఐఐటీ ప్రవేశాల నోటిఫికేషన్ వచ్చేసింది. మే 31 నుంచి జూన్‌ 21వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్‌ విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

Published on: May 29, 2025 3:03 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసరలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐఐటీ క్యాంపస్ లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. టెన్త్ పాస్ అయిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.

బాసర ఐఐఐటీలో ప్రవేశాలు
బాసర ఐఐఐటీలో ప్రవేశాలు

మే 31 నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్‌ 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జులై 4వ తేదీన ప్రొవిజనల్ లిస్ట్ ను ప్రకటిస్తారు. జులై 7న ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు https://www.rgukt.ac.in/ లింక్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

ఈసారి మార్పులు ఇలా…!

గతేడాది వరకు తెలంగాణ టెన్త్ ఫలితాలను గ్రేడింగ్విధానంలో ప్రకటించారు. పాత పద్ధతికి స్వస్తి పలికిన తెలంగాణ సర్కార్… ఈ ఏడాది మార్కులను ప్రకటించింది. పాత పద్ధతిలోనే మార్కులను ప్రకటించే విధానాన్ని పునఃప్రారంభించింది. ఫలితంగా గ్రేడ్స్ కాకుండా… మార్కుల ఆధారంగానే ఐఐఐటీలోనూ ప్రవేశాలను కల్పించనున్నారు.

ఎంపిక విధానం ఎలా….

  • ఐఐఐటీ క్యాంపస్ లో ప్రవేశాల కోసం పదో తరగతిపాస్ అయిన విద్యార్థులు అప్లయ్ చేసుకునేందుకు అర్హులవుతారు.
  • పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గ్రామీణ పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వీరికే అత్యధికంగా సీట్లు కేటాయిస్తారు.
  • ఈ ఏడాది బాసరలోని 1500 సీట్లు మాత్రమే కాకుండా… మహబూబ్‌నగర్‌ లోనూ ఐఐఐటీ క్యాంపస్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది నుంచే ప్రవేశాలను ఖరారు చేశారు. ఇక్కడ 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • ఎంపికైన వారికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. వీరికి హాస్టల్ సదుపాయం ఉంటుంది.
  • తాజాగా మార్కుల విధానం అమలు చేస్తుండటంతో… ప్రవేశాల ప్రక్రియలో కొన్ని మార్పులు చేశారు.
  • ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు 4 మార్కుల చొప్పున కలుపుతారు. అంటే మొత్తం 24 అదనపు మార్కులు జోడిస్తారు. ఈ విధానంతో సర్కారు బడుల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులకు లబ్ది చేకూరనుంది.
  • ఒకవేళ 2 విద్యార్థుల మార్కులు సమానంగా ఉంటే ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గణితంలో, తర్వాత సైన్స్‌, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ఫస్ట్‌ లాంగ్వేజ్‌లో సాధించిన గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు కేటాయిస్తారు.
  • సబ్జెక్టుల్లోనూ సమానంగా ఉంటే వయసు ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.
  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More