ఐబీపీఎస్ పీఓ 2025 ఎగ్జామ్ పాటర్న్‌లో భారీ మార్పులు- పూర్తి వివరాలు..
ఐబీపీఎస్ పీఓ 2025 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారికి కీలక అలర్ట్! ఈ ఏడాది ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ పాటర్న్‌లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రశ్నలను, టైమ్‌ని తగ్గించారు. ఇంకొన్ని చోట్ల ప్రశ్నల సంఖ్యను పెంచారు. పూర్తి వివరాలు..
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ఈ సంవత్సరం ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ పాటర్న్స్‌లో కీలక మార్పులు చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐబీపీఎస్ పీఓ పరీక్షా విధానం 2025: ముఖ్య మార్పులు
ఐబీపీఎస్ పీఓ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibps.inని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రిలిమినరీ పరీక్షలో మార్పులు:
ప్రిలిమినరీ పరీక్షల్లో, గత సంవత్సరంతో పోలిస్తే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టుకు కేటాయించిన మార్కులను 35 నుంచి 30కి తగ్గించారు. అదే సమయంలో, రీజనింగ్ ఎబిలిటీ మార్కులను 30 నుంచి 40కి పెంచారు. ఓవరాల్ ప్యాటర్న్ మాత్రమే మారగా.. మార్కులు, పరీక్షా సమయం గతంలో ఉన్నట్టే కొనసాగుతాయి.
మెయిన్స్ పరీక్షలో మార్పులు:
ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ పరీక్షల్లో, రీజనింగ్- కంప్యూటర్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన ప్రశ్నల సంఖ్యను 45 నుంచి 40కి తగ్గించారు. పరీక్షా సమయం కూడా 2024లోని 60 నిమిషాల నుంచి 50 నిమిషాలకు కుదించారు.
జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్అవేర్‌నెస్ సబ్జెక్టులకు ఇప్పుడు ఎక్కువ మార్కులు కేటాయించారు. కానీ ప్రశ్నల సంఖ్య తగ్గింది. వీటికి 50 మార్కులు, 35 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం కూడా 2024లోని 35 నిమిషాల నుంచి 25 నిమిషాలకు తగ్గించబడింది.
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్‌కు గత సంవత్సరం 60 మార్కులతో పోలిస్తే ఇప్పుడు 50 మార్కులు కేటాయించారు.
ఐబీపీఎస్ పీఓ 2025 మెయిన్స్ పరీక్షలలో మొత్తం ఆబ్జెక్టివ్ ప్రశ్నల సంఖ్య 155 నుంచి 145కి తగ్గించారు. మొత్తం పరీక్షా సమయం కూడా గత సంవత్సరం 180 నిమిషాల నుంచి 160 నిమిషాలకు కుదించారు.
ఐబీపీఎస్ పీఓ 2025: ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు - ఫీజు చెల్లింపు విండో: జులై 21, 2025 వరకు
ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్: ఆగస్టు 2025
ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ విడుదల: ఆగస్టు 2025
ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2025
ప్రిలిమ్స్ ఫలితాల ప్రకటన: సెప్టెంబర్ 2025
మెయిన్స్ అడ్మిట్ కార్డ్: సెప్టెంబర్/అక్టోబర్ 2025
మెయిన్ పరీక్ష: అక్టోబర్ 2025
మెయిన్స్ ఫలితం: నవంబర్ 2025
పర్సనాలిటీ టెస్ట్: నవంబర్/డిసెంబర్ 2025
ఇంటర్వ్యూ రౌండ్‌లు: డిసెంబర్ 2025/జనవరి 2026
తాత్కాలిక కేటాయింపు: జనవరి/ఫిబ్రవరి 2026
పీఓ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్‌ను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ఐబీపీఎస్ పీఓ 2025 రిజిస్ట్రేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper



