న్యూజిలాండ్‌తో తొలి టీ20కి టీమిండియా తుది జట్టు ఇదే.. ఇషాన్ కిషన్‌ కన్ఫమ్.. మూడో స్థానంలో ఆడతాడన్న సూర్యకుమార్

న్యూజిలాండ్ తో జరగనున్న తొలి టీ20లో ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నాడు. అతడు మూడో స్థానంలో ఆడతాడని కెప్టెన్ సూర్యకుమార్ చెప్పాడు. తిలక్ వర్మ లేకపోవడంతో ఇషాన్ తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు.

Published on: Jan 20, 2026, 20:33:40 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత జట్టులోకి తిరిగి రావడానికి ఇషాన్ కిషన్ చేసిన నిరీక్షణ ఫలించింది. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ టీమిండియా జెర్సీలో మైదానంలోకి దిగడానికి రంగం సిద్ధమైంది. నాగ్‌పూర్ వేదికగా బుధవారం (జనవరి 21) న్యూజిలాండ్‌తో జరగనున్న మొదటి టీ20 మ్యాచ్‌ తుది జట్టులో ఇషాన్ కిషన్ ఉంటాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మంగళవారం ధృవీకరించాడు.

న్యూజిలాండ్‌తో తొలి టీ20కి టీమిండియా తుది జట్టు ఇదే.. ఇషాన్ కిషన్‌ కన్ఫమ్.. మూడో స్థానంలో ఆడతాడన్న సూర్యకుమార్ (PTI)
న్యూజిలాండ్‌తో తొలి టీ20కి టీమిండియా తుది జట్టు ఇదే.. ఇషాన్ కిషన్‌ కన్ఫమ్.. మూడో స్థానంలో ఆడతాడన్న సూర్యకుమార్ (PTI)

నంబర్ 3లో ఇషాన్..

యువ ఆటగాడు తిలక్ వర్మ పొత్తికడుపు శస్త్రచికిత్స కారణంగా మొదటి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న ప్రశ్నకు సూర్య సమాధానం ఇచ్చాడు. జట్టులో శ్రేయస్ అయ్యర్ ఉన్నప్పటికీ, మేనేజ్‌మెంట్ ఇషాన్‌ వైపే మొగ్గు చూపింది.

"ఇషాన్ కిషన్ నంబర్ 3లో బ్యాటింగ్ చేస్తాడు. మేం అతన్ని వరల్డ్ కప్ జట్టు కోసం ఎంపిక చేశాం. అతను చాలా కాలంగా జట్టుకు ఆడలేదు కాబట్టి ఇప్పుడు అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయం. తిలక్ లేని లోటును పూడ్చడానికి ఇషాన్ మా బెస్ట్ ఛాయిస్" అని సూర్యకుమార్ తెలిపాడు.

దేశవాళీలో పరుగుల వరద..

గతంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ కిషన్.. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఝార్ఖండ్ జట్టును విజేతగా నిలిపాడు. ఆ టోర్నీలో 10 మ్యాచ్‌లలో 197.33 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 517 పరుగులు చేసి సెలెక్టర్లను మెప్పించాడు. ఈ ప్రదర్శనే అతనికి తిరిగి టీమిండియా పిలుపు అందేలా చేసింది.

తిలక్, సుందర్ దూరం..

తిలక్ వర్మతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. సుందర్ స్థానంలో రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చాడు. ఇషాన్ కిషన్ చివరిసారిగా 2023 నవంబర్‌లో భారత్ తరపున టీ20 ఆడాడు. న్యూజిలాండ్ తో తొలి టీ20 మ్యాచ్‌తో తన రీఎంట్రీని ఎలా ఘనంగా చాటుకుంటాడో చూడాలి. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ గెలిచిన ఊపు మీదున్న న్యూజిలాండ్.. ఇండియాకు టీ20ల్లోనూ షాకివ్వాలని చూస్తోంది.

ఇండియా తుది జట్టు ఇదే

అభిషేక్ శర్మ (ఓపెనర్)

సంజు శాంసన్ (వికెట్ కీపర్ / ఓపెనర్)

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)

ఇషాన్ కిషన్

హార్దిక్ పాండ్యా (ఆల్ రౌండర్)

అక్షర్ పటేల్ (స్పిన్ ఆల్ రౌండర్)

రింకూ సింగ్ (ఫినిషర్)

హర్షిత్ రాణా / శివమ్ దూబే (పేసర్ / ఆల్ రౌండర్)

అర్ష్‌దీప్ సింగ్ / కుల్దీప్ యాదవ్ (పేసర్ / స్పిన్నర్)

జస్ప్రీత్ బుమ్రా (పేసర్)

వరుణ్ చక్రవర్తి (స్పిన్నర్)

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More