దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం - కుప్పకూలిన భారత్ తేజస్ యుద్ధ విమానం, పైలట్ మృతి
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఎయిర్‌షోలో ప్రమాదం జరిగింది. భారత్‌కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు.
దుబాయ్ ఎయిర్ షోలో అనుకోని ప్రమాదం జరిగింది. భారత్ కు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ కూలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్‌షోలో విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా తేజస్ కూలిపోయి భూమిని తాకింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు.

పైలెట్ మృతి…
ఈ ఘటనపై భారత వైమానిక విభాగం స్పందించింది. “ఈరోజు దుబాయ్ ఎయిర్ షోలో వైమానిక ప్రదర్శన సందర్భంగా IAF తేజస్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్ తీవ్రంగా గాయపడి.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై IAF తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. పైలెట్ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేస్తున్నాం” అని ప్రకటన విడుదల చేసింది.
వైమానిక ప్రదర్శనలో భాగంగా తేజస్ యుద్ధ విమానం గాల్లో పలుమార్లు విన్యాసాలు చేసింది. ఆ తర్వాత గాల్లో గింగిరాలు తిరిగి నేలను బలంగా ఢీకొట్టడంతో వెంటనే క్రాష్ అయింది. దీంతో ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన, నల్లటి పొగ కమ్ముకుంది.
తేజస్ యుద్ధ విమాన ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్, సంబంధిత అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
శుక్రవారంతో ఈ ఎయిర్ షో ముగియనుంది. వైమానిక ప్రదర్శనను చూడటానికి చాలా కుటుంబాలు తరలివచ్చాయి. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాయి.
తేజస్ అనేది భారతదేశం యొక్క స్వదేశీ యుద్ధ విమానం. దీనిని ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిర్మించింది. ఇక ఎయిర్ షోలో తేజస్ విమానం… చమురు లీకేజీకి గురైందంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో కనిపింటాయి. వీటిని తప్పుడు పోస్టులుగా పేర్కొంటూ పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఓ ప్రకటన విడుదల చేసింది.
గతేడాది రాజస్థాన్ లో కూడా తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. కానీ ఆ సంఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

