IOCL Apprentice Recruitment 2026 : ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​- పూర్తి వివరాలు..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 433 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రిక్రూట్​మెంట్​ ప్రక్రియ కొనసాగుతోంది. ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 24, 2026, 14:01:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) దేశవ్యాప్తంగా వివిధ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ iocl.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఐఓసీఎల్ ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 433 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఐఓసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ వివరాలు.. (Bloomberg)
ఐఓసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ వివరాలు.. (Bloomberg)

దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 6, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. విద్యార్హతలు, వయస్సు పరిమితి, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఐఓసీఎల్ రిక్రూట్​మెంట్​ 2026- విద్యార్హత, వయస్సు వివరాలు..

ఐఓసీఎల్ అప్రెంటిస్ రిక్రూట్​మెంట్​ 2026కి సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు పదొవ తరగతి (మెట్రిక్) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ గుర్తించిన సంస్థ నుంచి రెండేళ్ల రెగ్యులర్ ఐటీఐ కోర్సు పూర్తి చేసి ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.

అభ్యర్థుల వయస్సు ఆగస్టు 31, 2026 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులకు 3 ఏళ్లు (గరిష్టంగా 27 ఏళ్ల వరకు) సడలింపు వర్తిస్తుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోసడలింపు లభిస్తుంది.

ఐఓసీఎల్ రిక్రూట్​మెంట్​ 2026- ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

నాప్స్ లేదా నాట్స్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఎంపిక కోసం పరిగణిస్తారు. ఈ నియామకానికి ఎలాంటి రాత పరీక్ష కానీ, ఇంటర్వ్యూ కానీ ఉండదు.

పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధిత విద్యార్హతలో వచ్చిన మార్కుల శాతాన్ని ఆధారంగా చేసుకుని మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు ఒకేలాంటి మార్కులు వస్తే, పుట్టిన తేదీ ప్రకారం ఎక్కువ వయస్సు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. పుట్టిన తేదీ కూడా ఒకేలా ఉంటే, పదొవ తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చినవారిని ఎంపిక చేస్తారు.

ఐఓసీఎల్ రిక్రూట్​మెంట్​ 2026- ధ్రువపత్రాల పరిశీలన..

మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అభ్యర్థులు పుట్టిన తేదీ ధృవీకరణ కోసం పదొవ తరగతి మార్కుల జాబితాను మాత్రమే సమర్పించాలి. అలాగే రిజర్వేషన్ వర్గానికి చెందినవారు నిబంధనల ప్రకారం జారీ చేసిన కుల ధ్రువపత్రాలను చూపించాల్సి ఉంటుంది.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఐఓసీఎల్ రిక్రూట్​మెంట్​ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More