...
...
Next Story

ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతలు.. ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 16, 2025, 08:15:11 IST
By ,
Prefer HTon Google
Advertisement

ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 573 పాయింట్లు పడి 81,119 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 169 పాయింట్లు పతనమై 24,719 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 555 పాయింట్లు పడి 55,527 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1263.52 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,041.44 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

జూన్​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 4821.39 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 44150.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక దేశీయ స్టాక్ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 24,850 మార్క్​ దిగువన ఉన్నంత వరకు నెగిటివ్​ సెంటిమెంట్​ ఉన్నట్టు. 24,500 లెవల్స్​ కూడా బ్రేక్​ అయితే అమ్మకాల ఒత్తిడి మరింత పెరగొచ్చు," అని కొటాక్​ సెక్యూరిటీస్​ టెక్నికల్​ రీసెర్చ్​ వైస్​ ప్రెసిడెంట్​ అమోల్​ అథవాలే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.79 శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.13శాతం పతనమైంది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.30 శాతం పడింది.

ఆర్​పీజీ లైఫ్​ సైన్సెస్​- బై రూ. 2341.5, స్టాప్​ లాస్​ రూ. 2250, టార్గెట్​ రూ. 2500

గుడ్​లక్​ ఇండియా- బైరూ. 997.5, స్టాప్​ లాస్​ రూ. 960, టార్గెట్​ రూ. 1070

స్టీల్​ అథారిటీ ఆఫ్​ ఇండియా- బై రూ. 128, స్టాప్​ లాస్​ రూ. 124, టార్గెట రూ. 138

ఎస్​బీఐ- బై రూ. 793, స్టాప్​ లాస్​ రూ. 782, టార్గెట్​ రూ. 815

హిందుస్థాన్​ ఎయిరోనాటిక్స్​- బై రూ. 5033, స్టాప్​ లాస్​ రూ. 4950, టార్గెట్​ రూ. 5200

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe