కేంద్రీయ విద్యాలయ రిక్రూట్‌మెంట్- 9వేలకుపైగా పోస్టులు, ఇలా అప్లై చేసుకోండి..
కేంద్రీయ విద్యాలయ రిక్రూట్‌మెంట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి మొత్తం 9వేలకుపైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యార్హత, వయస్సు పరిమితితో పాటు ఎలా అప్లై చేసుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సంయుక్తంగా 2025 సంవత్సరానికి గాను మొత్తం 9,126 టీచింగ్, నాన్- టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి.
వీటిలో 7,444 పోస్టులు ప్రైమరీ టీచర్లు (పీఆర్టీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ప్రిన్సిపాల్‌లు, వైస్-ప్రిన్సిపాల్‌లు, లైబ్రేరియన్ల కోసం కేటాయించారు.
మిగిలిన 1,712 పోస్టులు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు, ఏఎస్ఓలు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, ఫైనాన్స్ అధికారులు, ఇంజనీర్లు, అనువాదకులు (ట్రాన్స్‌లేటర్లు), స్టెనోగ్రాఫర్‌లు వంటి బోధనేతర విభాగంలో ఉన్నాయి.
కేంద్రీయ విద్యాలయ రిక్రూట్‌మెంట్- ముఖ్యమైన తేదీలు, పరీక్షా విధానం
కేంద్రీయ విద్యాలయ రిక్రూట్‌మెంట్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 14న ప్రారంభమైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను డిసెంబర్ 4 వరకు అధికారిక పోర్టల్స్ అయిన kvsangathan.nic.in, cbse.nic.in ద్వారా సమర్పించవచ్చు.
నోటిఫికేషన్ ప్రకారం.. రాత పరీక్షలు 2026 జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అడ్మిట్ కార్డులు 2025 డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. తదుపరి వివరాలు అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి.
కేంద్రీయ విద్యాలయ రిక్రూట్‌మెంట్- టీచింగ్ పోస్టుల ఖాళీలు
పీజీటీ పోస్టులు (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు):
ఇంగ్లీష్, హిందీ, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ వంటి సబ్జెక్టులలో సీనియర్ సెకండరీ తరగతులకు బోధించడానికి మొత్తం 1,934 పోస్టులు ప్రకటించారు.
టీజీటీ పోస్టులు (ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు):
ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు బోధించడానికి ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ వంటి సబ్జెక్టులలో 3,619 ఖాళీలు ఉన్నాయి.
పీఆర్టీ పోస్టులు (ప్రైమరీ టీచర్లు):
మొదటి తరగతి నుంచి ఐదవ తరగతి వరకు బోధించడానికి జనరల్ టీచర్లతో పాటు ప్రైమరీ టీచర్ (మ్యూజిక్) పోస్టులతో కలిపి మొత్తం 1,966 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
బోధనేతర పోస్టుల ఖాళీలు (1,712)
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ)
- సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎస్ఎస్ఏ)
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ)
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
- ఫైనాన్స్ ఆఫీసర్
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)
- జూనియర్ ట్రాన్స్‌లేటర్
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ I, II
కేంద్రీయ విద్యాలయ రిక్రూట్‌మెంట్ 2025- అర్హత ప్రమాణాలు
వయోపరిమితి
- ప్రిన్సిపాల్: 35–50 సంవత్సరాలు
- వైస్-ప్రిన్సిపాల్: 35–45 సంవత్సరాలు
- పీజీటీ: 40 సంవత్సరాల వరకు
- టీజీటీ: 35 సంవత్సరాల వరకు
- పీఆర్టీ: 30 సంవత్సరాల వరకు
- లైబ్రేరియన్: 35 సంవత్సరాల వరకు
- ఏఎస్ఓ / ఫైనాన్స్ ఆఫీసర్ / ఏఈ (సివిల్): 35 సంవత్సరాల వరకు
- జేఎస్ఏ: 27 సంవత్సరాల వరకు
- ఎస్ఎస్: 30 సంవత్సరాల వరకు
రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు
ప్రిన్సిపాల్: పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ, 8 సంవత్సరాల అనుభవం.
వైస్-ప్రిన్సిపాల్: 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ.
పీజీటీ: మాస్టర్స్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సు 50% మార్కులతో పాటు బీఈడీ
టీజీటీ: సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, బీఈడీ.
పీఆర్టీ: సీనియర్ సెకండరీతో పాటు D.El.Ed / B.El.Ed / D.Ed (ప్రత్యేక విద్య) లేదా బీఈడీతో గ్రాడ్యుయేషన్.
లైబ్రేరియన్: లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా.
ఫైనాన్స్ ఆఫీసర్- ఏఎశ్ఓ: సంబంధిత అనుభవంతో గ్రాడ్యుయేషన్.
అసిస్టెంట్ ఇంజనీర్: సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా మరియు అనుభవం.
జేఎస్ఏ/ఎస్ఎస్ఏ: క్లాస్ XII లేదా టైపింగ్, కంప్యూటర్ నైపుణ్యంతో గ్రాడ్యుయేషన్.
అభ్యర్థులు పోస్టుల వారీగా పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి.
కేంద్రీయ విద్యాలయ రిక్రూట్‌మెంట్ 2025 కి ఎలా దరఖాస్తు చేయాలి?
kvsangathan.nic.in లేదా cbse.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
"KVS Application Form 2025" లింక్‌పై క్లిక్ చేయండి.
చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోండి.
వ్యక్తిగత, విద్యా వివరాలను పూరించండి.
నిర్దేశించిన కొలతల ప్రకారం స్కాన్ చేసిన ఫోటో, సంతకం, వేలిముద్రను అప్‌లోడ్ చేయండి.
ఏదైనా ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించండి.
అన్ని వివరాలను ఒకసారి సమీక్షించి, ఫారమ్‌ను సమర్పించండి.
భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు కాపీని డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


