భారతీయ వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం 'కియా'.. దేశీయ మార్కెట్లో భారీ విస్తరణకు శ్రీకారం చుట్టింది. 2026 ఏప్రిల్‌లో జరిగిన ఇన్వెస్టర్ డే వేదికగా ప్రకటించిన ప్రణాళికలకు అనుగుణంగా, భారత్‌లో తమ వాహనాల శ్రేణిని 10 మోడళ్లకు పెంచే దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఇటీవలే మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ప్రీమియం ఎస్‌యూవీ ‘సోరెంటో’తో కలిపి ప్రస్తుతం కంపెనీ లైనప్‌లో 8 మోడళ్లు అందుబాటులో ఉండగా, మిగిలిన రెండు నూతన మోడళ్లను రాబోయే మూడేళ్లలో రోడ్డెక్కించేందుకు కసరత్తు పూర్తి చేస్తోంది.

ఈ భారీ లక్ష్య సాధనకు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం తయారీ కేంద్రం వెన్నెముకగా నిలవనుంది! పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు, కొత్త మోడళ్ల ఉత్పత్తి కోసం అనంతపురం ప్లాంట్‌లో మరో నూతన అసెంబ్లీ లైన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు యాజమాన్యం పరిశీలిస్తోంది. 2030 నాటికి భారతదేశంలో ఏడాదికి 4.1 లక్షల కార్ల విక్రయాలు సాధించడంతో పాటు 7.6 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవాలని కియా నిర్దేశించుకుంది. ఈ విస్తరణ ద్వారా రాయలసీమ ప్రాంతంలో స్థానిక ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
సోనెట్, సెల్టోస్ మధ్య కొత్త 'బి-సెగ్మెంట్' ఎస్‌యూవీ
మీడియా నివేదికల ప్రకారం, కియా తీసుకురానున్న 9వ మోడల్ బీ-సెగ్మెంట్‌కు చెందిన దాదాపు 4.2 మీటర్ల పొడవు ఉండే సరికొత్త ఎస్‌యూవీ! ఇది మార్కెట్లో సోనెట్, సెల్టోస్ మధ్య ఉన్న ధర, పరిమాణ వ్యత్యాసాన్ని భర్తీ చేస్తుంది.
హ్యుందాయ్ బేయాన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందే ఈ కారు ద్వారా కియా ఇండియా చరిత్రలోనే తొలిసారిగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ ఆప్షన్‌ను అందించబోతోంది. 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, మైల్డ్ హైబ్రిడ్, సీఎన్జీ వర్షన్లలో ఇది లభించనుంది. మార్కెట్లో పాపులర్ అవుతున్న మారుతీ సుజుకీ విక్టోరిస్ వంటి మోడళ్లకు పోటీగా 2028 నాటికి ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని తయారీకి కంపెనీ ఇప్పటికే అంతర్గత ఆమోదం తెలిపింది.
సెల్టోస్‌కు పైన.. పవర్‌ఫుల్ 'సీ-సెగ్మెంట్' ఎస్‌యూవీ
ఇక 10వ మోడల్‌గా సెల్టోస్, సోరెంటో మోడళ్ల మధ్య స్థానాన్ని భర్తీ చేసేలా ఒక అత్యాధునిక 'సీ-సెగ్మెంట్' ఎస్‌యూవీని కంపెనీ ప్రతిపాదిస్తోంది. హ్యుందాయ్ అభివృద్ధి చేస్తున్న ఫ్యూచరిస్టిక్ ఎంపీవీ లేదా ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ ఆర్కిటెక్చర్పైనే దీనిని రూపొందించే యోచనలో ఉన్నారు. వివిధ రకాల పవర్‌ట్రెయిన్ (పెట్రోల్, హైబ్రిడ్) ఆప్షన్లతో రానున్న ఈ ప్రొడక్ట్ ప్రస్తుతం విశ్లేషణ దశలో ఉంది. ఇది 2028 నుంచి 2029 మధ్యకాలంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
{{/usCountry}}ఇక 10వ మోడల్‌గా సెల్టోస్, సోరెంటో మోడళ్ల మధ్య స్థానాన్ని భర్తీ చేసేలా ఒక అత్యాధునిక 'సీ-సెగ్మెంట్' ఎస్‌యూవీని కంపెనీ ప్రతిపాదిస్తోంది. హ్యుందాయ్ అభివృద్ధి చేస్తున్న ఫ్యూచరిస్టిక్ ఎంపీవీ లేదా ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ ఆర్కిటెక్చర్పైనే దీనిని రూపొందించే యోచనలో ఉన్నారు. వివిధ రకాల పవర్‌ట్రెయిన్ (పెట్రోల్, హైబ్రిడ్) ఆప్షన్లతో రానున్న ఈ ప్రొడక్ట్ ప్రస్తుతం విశ్లేషణ దశలో ఉంది. ఇది 2028 నుంచి 2029 మధ్యకాలంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
{{/usCountry}}హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో కియా సోనెట్, సెల్టోస్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఫ్యాక్టరీ సీఎన్జీ, హైబ్రిడ్ సాంకేతికతతో రాబోతున్న ఈ కొత్త ఎస్‌యూవీలు తెలుగు రాష్ట్రాల్లోని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కొనుగోలుదారులను విశేషంగా ఆకట్టుకుంటాయని ఆటోమొబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు.