వైరల్​ వీడియో : రైలులో వాష్​రూమ్​ని బెడ్​రూమ్​గా మార్చేశాడు..!

వాష్‌రూమ్‌ను బెడ్‌రూమ్‌గా మార్చిన ఓ ప్రయాణికుడి వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దీనిపై నెజిటన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మరికొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Published on: Oct 25, 2025, 09:15:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మన దేశంలో రైలు ప్రయాణాల్లో చోటు చేసుకునే విచిత్ర సంఘటనలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఒక వ్యక్తి ఏకంగా రైలు వాష్‌రూమ్‌నే.. తన తాత్కాలిక బెడ్‌రూమ్‌గా మార్చుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్​ని షాక్​కి గురి చేస్తోంది.

రైలు టాయిలెట్​ని బెడ్​రూమ్​ చేశాడు! (Instagram/mr.vishal_sharma_)
రైలు టాయిలెట్​ని బెడ్​రూమ్​ చేశాడు! (Instagram/mr.vishal_sharma_)

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఆ వ్యక్తి రైలు టాయిలెట్ లోపల తన ప్రయాణ సామాగ్రిపై పడుకుని ఉండటం కనిపిస్తోంది. అంతేకాకుండా, తను ఇంటి నుంచి తెచ్చుకున్న మడత మంచాన్ని.. రైలు కిటికీలోంచి బయటకు కట్టిపెట్టాడు. రైలు బయటి ప్లాట్‌ఫామ్ నుంచి తీసిన ఈ క్లిప్, లోపల ఆ ప్రయాణికుడు ఏర్పాటు చేసుకున్న వినూత్న సెటప్‌ను కూడా స్పష్టంగా చూపిస్తోంది.

వీడియో తీసిన వ్యక్తి స్పందన..

ఈ వీడియోను విశాల్ అనే కంటెంట్ క్రియేటర్ రైల్వే ప్లాట్‌ఫామ్‌పై నిలబడి తీశాడు. వీడియోలో విశాల్ ఆశ్చర్యంగా, "భాయ్ నే వాష్‌రూమ్ కో బెడ్‌రూమ్ బనా దియా" (ఈ వ్యక్తి వాష్‌రూమ్‌ను బెడ్‌రూమ్‌గా మార్చేశాడు) అని అన్నాడు.

అంతేకాక, "ఇదంతా మీ ఇంటి సామానేనా?" అని అడగ్గా, ఆ ప్రయాణికుడు చాలా సాధారణంగా "అవును" అని బదులిచ్చాడు. ఈ క్లిప్‌ను "ట్రైన్ వాష్‌రూమ్ బనా దియా బెడ్‌రూమ్" అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు విశాల్​.

నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు..

ఈ వీడియో ఇప్పటికే ఆరు లక్షలకు పైగా వ్యూస్‌ను దాటింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో పాటు, భిన్నరకాల కామెంట్లతో స్పందిస్తున్నారు.

కొంతమంది ఈ సంఘటనలో సరదా అంశాన్ని చూస్తే, మరికొందరు పరిశుభ్రత, ప్రజా ఆస్తిని దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

“ఇలాంటి సృజనాత్మకత భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది,” అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. “అతను నిజంగా వాష్‌రూమ్‌ను బెడ్‌రూమ్‌గా మార్చేశాడు. నమ్మశక్యం కాదు!” అని మరొకరు అన్నారు. ఇంకొకరు, “ఇండియన్ రైల్వేస్.. ప్రయాణికులు ఏం చేస్తున్నారో పర్యవేక్షించాలి,” అని సూచించారు.

ప్రయాణికుడిపై సానుభూతి..

అయితే, మరికొందరు వీక్షకులు ఆ వ్యక్తి పరిస్థితిపై సానుభూతిని చూపించారు. సుదీర్ఘ ప్రయాణాల్లో సీట్లు దొరకకపోవడం, సౌకర్యాల లేమిని గుర్తు చేశారు.

“బహుశా అతనికి సీటు దొరకలేదేమో, అందుకే ఏదోలా సర్దుబాటు చేసుకున్నాడు,” అని ఒక నెటిజన్ రాశారు.

“రైలు ప్రయాణాల్లో ఉండే గందరగోళం నుంచి బయటపడటానికి ప్రజలు ఇలాంటి మార్గాలు వెతుక్కుంటున్నారు,” అని మరొకరు అన్నారు.

“ఇది సాధారణ ప్రయాణికుల కష్టాన్ని ఎక్కువగా చూపిస్తుంది,” అని ఇంకొకరు వ్యాఖ్యానించారు.

ఈ వీడియో రైలు ప్రయాణాల్లో కొంతమంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను, అలాగే ప్రయాణికుల విచిత్ర ప్రవర్తనను కళ్లకు కట్టినట్లు చూపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ వీడియో ఎక్కడ? ఎప్పుడు? తీశారు అన్నది తెలియరాలేదు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More