మారుతీ సుజుకీ విక్టోరిస్ కొనాలా? లేక గ్రాండ్ విటారా తీసుకోవాలా? ఏ ఎస్యూవీ బెస్ట్?
మారుతీ సుజుకీ విక్టోరిస్ వర్సెస్ గ్రాండ్ విటారా.. ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? ఎందులో ఫీచర్స్ ఎక్కువ? దేని ధర ఎంత? పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
మారుతీ సుజుకీ నుంచి కొత్త ఎస్యూవీ ఇటీవలే మార్కెట్లోకి అడుగుపెట్టింది. దాని పేరు మారుతీ సుజుకీ విక్టోరిస్. అయితే ఇదే సంస్థకు చెందిన గ్రాండ్ విటారాకి కూడా మంచి డిమాండ్ ఉంటూ ఉంటుంది. మరి ఇప్పుడు కొత్తగా ఎస్యూవీ కొనాలనుకునే వారు ఏది తీసుకోవాలి? మారుతీ సుజుకీ విక్టోరిస్ బెస్ట్ ఆ? లేక మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా మంచి ఆప్షన్ అవుతుందా? ఈ రెండింటినీ పోల్చి, పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

విక్టోరిస్ వర్సెస్ విటారా- డైమెన్షన్స్
| డైమెన్షన్స్ | వ్యత్యాసం (ఎంఎం) | మారుతీ సుజుకీ విక్టోరిస్ (ఎంఎం) | మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా (ఎంఎం) |
|---|---|---|---|
| పొడవు | + 15 | 4,360 | 4,345 |
| వెడల్పు | - | 1,795 | 1,795 |
| ఎత్తు | + 10 | 1,655 | 1,645 |
| వీల్‌బేస్ | - | 2,600 | 2,600 |
మారుతీ సుజుకీ విక్టోరిస్ వర్సెస్ గ్రాండ్ విటారా- డిజైన్..
మారుతీ సుజుకీ విక్టోరిస్ డిజైన్ షార్ప్‌గా, మోడర్న్‌గా ఉంటుంది. బోల్డ్ ఫ్రెంట్ గ్రిల్, స్లీక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, క్రిస్ప్ బాడీ లైన్స్ వంటివి ఎస్‌యూవీకి స్పోర్టీ, అగ్రెసివ్ లుక్‌ని ఇస్తాయి. యువతకు నచ్చే విధంగా ఈ వాహనాన్ని రూపొందించారు అని అనడంలో సందేహం లేదు.
కాగా, గ్రాండ్ విటారాలో ట్రెడిషన్ ఎస్యూవీ లుక్ ఉంటుంది. రోబస్ట్, క్రోమ్ అసెంటెడ్ గ్రిల్, కన్వెన్షనల్ హెడ్‌ల్యాంప్స్ వంటివి దీని సొంతం.
మారుతీ సుజుకీ విక్టోరిస్ వర్సెస్ గ్రాండ్ విటారా- ఇంటీరియర్, ఫీచర్స్..
మారుతీ సుజుకీ విక్టోరిస్ కేబిన్ అత్యాధునికంగా ఉంటుంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైమెంట్ సస్టెమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియెంట్ లైటింగ్ వంటివి ఉంటాయి. లెవల్ 2 అడాస్ ఫీచర్స్ దీని సొంతం. డాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్లు గ్రాండ్ విటారా కన్నా మోడర్న్‌గా కనిపిస్తాయి.
ఇక మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా విషయానికొస్తే, ఇందులో బేసిక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, చిన్న ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, సింపుల్ డాష్‌బోర్డ్ వంటివి ఉంటాయి. అని అవసరమైన ఫీచర్స్ ఇందులో ఉంటాయి కానీ విక్టోరిస్లోని పలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ మాత్రం ఉండదు.
మారుతీ సుజుకీ విక్టోరిస్ వర్సెస్ గ్రాండ్ విటారా- మైలేజ్..
మైలేజ్ వివరాలు..
| ఇంజిన్ | మారుతీ సుజుకీ విక్టోరిస్ (కేఎంపీహెచ్) | మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా (కేఎంపీహెచ్) |
|---|---|---|
| స్ట్రాంగ్ హైబ్రీడ్ | 28.65 | 27.97 |
| మైల్డ్ హైబ్రీడ్ ఎఫ్‌డబ్ల్యూడీ | 21.18 | 21.11 |
| మైల్డ్ హైబ్రీడ్ ఎఫ్‌డబ్ల్యూడీ ఏటీ | 21.06 | 20.58 |
| మైల్డ్ హైబ్రీడ్ ఏటీ | 19.07 | 19.20 |
| సీఎన్జీ | 27.02 కి.మీ/కేజీ | 26.6 కి.మీ/కేజీ |
రెండు ఎస్‌యూవీల్లోనూ మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీతో కూడిన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన స్ట్రాంగ్ ఇంజిన్, ఆల్ వీల్ డ్రైవ్ పవర్ట్రైన్ వంటివి ఉంటాయి. మైలేజ్ పరంగా చూసుకుంటే గ్రాండ్ విటారా కన్నా విక్టోరిస్ స్వల్పంగా ముందంజలో ఉంటుంది.
మారుతీ సుజుకీ విక్టోరిస్ వర్సెస్ గ్రాండ్ విటారా- ధరలు..
మారుతీ సుజుకీ విక్టోరిస్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 10.50లక్షలు. టాప్ ఎండ్ మోడల్ రూ. 19.99లక్షల (ఎక్స్‌షోరూం) వరకు ఉంటుంది. ఇక గ్రాండ్ విటారా ఎక్స్‌షోరూం ధర రూ. 10.77 లక్షల నుంచి రూ. 19.72 లక్షల వరకు ఉంటుంది.
మారుతీ సుజుకీ విక్టోరిస్ వర్సెస్ గ్రాండ్ విటారా- ఏది కొనాలి?
మీ ప్రయారిటీ కటింగ్ ఎడ్జ్ డిజైన్, మోడర్న్ టెక్నాలజీ అయితే విక్టోరిస్ మంచి అప్షన్ అవుతుంది. ట్రెడిషన్ ఎస్యూవీ, డ్యూరెబులిటీ కావాలనుకుంటే గ్రాండ్ విటారా తీసుకోవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












