...
...
Next Story

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్ - పరీక్షల తేదీలు మార్పు, ఇవిగో వివరాలు

ఏపీ డీఎస్సీ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 20, 21న జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలను విద్యాశాఖ మార్చింది. ఆయా పరీక్షలు వచ్చే నెల 1,2 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. యోగా డే సందర్భంగా డీఎస్సీ పరీక్షలు తేదీలు మార్చినట్లు వెల్లడించింది.

Published on: Jun 15, 2025 05:00 AM IST
By , , Andhrapradesh
Prefer HTon Google
Advertisement

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పులను చేసింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించినది. ఈ నేపథ్యంలో జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీపరీక్షల తేదీలను మార్పు చేస్తున్నట్లు డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణా రెడ్డి శనివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.

స్వల్ప మార్పులు…

ఏపీ డీఎస్సీ పరీక్షలు
ఏపీ డీఎస్సీ పరీక్షలు

యోగాడే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వారి రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఈ పరీక్షల తేదీలు మార్చినట్లు తెలిపారు. ఈ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలను మార్చిన హాల్ టిక్కెట్లను https://apdsc.apcfss.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. జూన్ 25వ తేదీన వీటిని వెబ్ సైట్ లో ఉంచుతామని ప్రకటించారు.

అభ్యర్ధులు ఈ విషయాన్ని గమనించి మార్చిన హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని డీఎస్సీ కన్వీనర్ సూచించారు. వాటి ప్రకారం పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని ప్రకటించారు.

ఏపీ డీఎస్సీ కీలు ఎప్పుడంటే…?

విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. డీఎస్సీపరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లో విడుదల చేస్తారు. అంటే జున్ 30వ తేదీతో ఎగ్జామ్స్ ముగుస్తాయి. జూలై 2వ తేదీన ప్రాథమిక కీలను విడుదల చేస్తారు.

విద్యాశాఖ విడుదల చేసే ప్రాథమిక కీలపై 7 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన మరో 7 రోజుల తర్వాత ఫైనల్ కీలను అందుబాటులోకి తీసుకువస్తారు. తుది కీ విడుదల చేసిన మరో ఏడు రోజుల తర్వాత మెరిట్ జాబితాలు విడుదలవుతాయి. అంటే ఆగస్టు నాటికి డీఎస్సీ పరీక్షల మెరిట్ జాబితాలపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కీలను విడుదల చేసే విషయం లేదా అభ్యంతరాలను పరిశీలించే విషయంలో ఒకటి రెండు ఆలస్యమైతే…. ఒకటి రెండు రోజులు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe