Nano Banana 2 : మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో 'నానో బనానా 2'- క్రియేటర్లకు పండగే!
గూగుల్ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఏఐ ఇమేజ్ జనరేషన్ మోడల్‌లో లేటెస్ట్ వెర్షన్ 'నానో బనానా 2'ను ఇటీవలే లాంచ్ చేసింది. వెబ్ సెర్చ్‌లోని రియల్ టైమ్ సమాచారంతో పనిచేసే ఈ మోడల్, అత్యంత వాస్తవికమైన చిత్రాలను సెకన్ల వ్యవధిలో రూపొందించగలదు. ఈ నేపథ్యంలో ఈ నానో బనానా 2 ఫీచర్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి..
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుతూ గూగుల్ మరో కీలక అడుగు వేసింది. తన శక్తివంతమైన ఇమేజ్ జనరేషన్ మోడల్ 'నానో బనానా'కు అప్‌గ్రేడెడ్ వెర్షన్ అయిన ‘నానో బనానా 2’ను ప్రపంచవ్యాప్తంగా ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఇది జెమినీ యాప్‌లోని ఫాస్ట్, థింకింగ్, ప్రో మోడ్‌లలో డిఫాల్ట్ ఆప్షన్‌గా పనిచేస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నానో బనానా 2 విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

గూగుల్ జెమినీ నానో బనానా 2- వేగం, నాణ్యత కలయిక!
"జెమినీ ఫ్లాష్ వేగవంతమైన మేధస్సును విజువల్ జనరేషన్‌కు జోడించడమే నానో బనానా 2 లక్ష్యం అని చెప్పుకోవాలి. దీనివల్ల వేగవంతమైన ఎడిటింగ్, అత్యుత్తమ నాణ్యత గల చిత్రాలను సృష్టించడం సాధ్యమవుతుంది," అని గూగుల్ తన ప్రకటనలో పేర్కొంది. గతంలో కేవలం 'ప్రో' వెర్షన్‌కే పరిమితమైన ఫీచర్లను ఇప్పుడు సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చారు.
గూగుల్ జెమినీ నానో బనానా 2 ప్రత్యేకతలు ఇవే..
రియల్ వరల్డ్ పరిజ్ఞానం: గూగుల్ సెర్చ్ మరియు వెబ్‌లోని రియల్ టైమ్ సమాచారాన్ని ఉపయోగించుకుని, ఏదైనా విషయాన్ని అత్యంత ఖచ్చితంగా చిత్రాల రూపంలో చూపిస్తుంది.
స్పష్టమైన టెక్స్ట్ అండ్ ట్రాన్స్‌లేషన్: మార్కెటింగ్ మోకప్స్ లేదా గ్రీటింగ్ కార్డ్స్ వంటి వాటిపై అక్షరాలను స్పష్టంగా ముద్రించడంతో పాటు, చిత్రంలోని సమాచారాన్ని ఇతర భాషల్లోకి అనువదించగలదు.
సంక్లిష్టమైన ఆదేశాల అమలు: వినియోగదారుడు ఇచ్చే క్లిష్టమైన ప్రాంప్ట్‌లను అర్థం చేసుకుని, వారు కోరుకున్న విధంగానే చిత్రాన్ని రూపొందిస్తుంది.
ప్రొడక్షన్ లెవల్ క్వాలిటీ: 512px నుంచి 4కే రిజల్యూషన్ వరకు మీకు నచ్చిన ఆస్పెక్ట్ రేషియోలో హై-క్వాలిటీ చిత్రాలను సృష్టించవచ్చు.
థింకింగ్ లెవల్స్: మోడల్ ఆలోచనా విధానాన్ని వినియోగదారులే నియంత్రించవచ్చు. క్లిష్టమైన అంశాలను చిత్రంగా మార్చే ముందు మోడల్ ఎంతవరకు విశ్లేషించాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు.
గూగుల్ జెమినీ నానో బనానా 2- ఎక్కడెక్కడ వాడుకోవచ్చు?
గత ఏడాది ఆగస్టులో వచ్చిన మొదటి వెర్షన్ కేవలం అక్టోబర్ నాటికే 500 కోట్ల చిత్రాలను సృష్టించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు నానో బనానా 2 వినియోగదారులకు జెమినీ యాప్‌తో పాటు గూగుల్ సెర్చ్ (లెన్స్, ఏఐ మోడ్), గూగుల్ క్లౌడ్ (వర్టెక్స్ ఏఐ), గూగుల్ యాడ్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
ముఖ్యంగా భారతదేశంతో పాటు 141 దేశాలలో, 8 అదనపు భాషల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల కంటెంట్ క్రియేటర్లు, డిజిటల్ మార్కెటర్లకు తమ ఐడియాలను విజువల్స్‌గా మార్చడం మరింత సులభం కానుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. 'నానో బనానా 2' మునుపటి వెర్షన్ కంటే ఎలా మెరుగైనది?
మునుపటి వెర్షన్‌తో పోలిస్తే నానో బనానా 2 లో 'రియల్ టైమ్ వెబ్ సెర్చ్' సదుపాయం ఉంది. అంటే, ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న తాజా పరిణామాలు, వ్యక్తులు లేదా వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని ఇది గూగుల్ సెర్చ్ ద్వారా వెతికి, వాటిని అత్యంత వాస్తవికమైన చిత్రాలుగా మారుస్తుంది. అలాగే, ఇందులో 4కే రిజల్యూషన్ వరకు హై-క్వాలిటీ చిత్రాలను మునుపటి కంటే వేగంగా సృష్టించవచ్చు.
2. ఇందులో టెక్స్ట్ (అక్షరాలు) సరిగ్గా కనిపిస్తాయా?
అవును, నానో బనానా 2 లో 'అడ్వాన్స్‌డ్ టెక్స్ట్ రెండరింగ్' ఫీచర్ ఉంది. పాత ఏఐ మోడల్స్ చిత్రాల్లోని అక్షరాలను సరిగ్గా చూపించలేకపోయేవి. కానీ, ఈ కొత్త వెర్షన్ గ్రీటింగ్ కార్డ్స్, పోస్టర్లు లేదా మార్కెటింగ్ డిజైన్లపై అక్షరాలను చాలా స్పష్టంగా, ఖచ్చితంగా ముద్రిస్తుంది. అంతేకాకుండా, చిత్రంలోని టెక్స్ట్‌ను ఇతర భాషల్లోకి అనువదించే సదుపాయం కూడా ఇందులో ఉంది.
3. నేను దీన్ని ఉచితంగా వాడుకోవచ్చా? ఇది ఎక్కడ అందుబాటులో ఉంటుంది?
నానో బనానా 2 జెమినీ ఫ్రీ వెర్షన్‌తో పాటు ప్రో, థింకింగ్, మోడ్‌లలో కూడా డిఫాల్ట్ ఆప్షన్‌గా పనిచేస్తుంది. అలాగే, గూగుల్ సెర్చ్, గూగుల్ లెన్స్, గూగుల్ యాడ్స్ వాడుతున్న వారికి కూడా ఈ కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


