NEET PG 2025 Counselling : రాష్ట్రాల వారీగా టాప్​ మెడికల్​ కాలేజీలు..

నీట్ పీజీ 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సీట్ల కేటాయింపు ప్రక్రియ, రాష్ట్రాల వారీగా టాప్ కాలేజీలకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి. మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.

Published on: Oct 18, 2025, 10:45:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నెలల తరబడి జాప్యం తర్వాత, నీట్ పీజీ 2025 కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించింది మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ). దీంతో విద్యార్థులు మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సాధారణంగా ప్రారంభ రౌండ్ రిజిస్ట్రేషన్ దాదాపు ఒక నెల పాటు తెరిచి ఉంటుంది. తదుపరి రౌండ్లలో రిజిస్ట్రేషన్ సమయం తక్కువగా ఉంటుంది. మొదటి రౌండ్‌లో సీటు రాని విద్యార్థులకు రెండో రౌండ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

నీట్​ పీజీ 2025- దేశంలో టాప్​ వైద్య కళాశాలలు..
నీట్​ పీజీ 2025- దేశంలో టాప్​ వైద్య కళాశాలలు..

తమ రాష్ట్రంలో లేదా దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ వైద్య కళాశాలల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు తమ ర్యాంక్‌ల గురించి స్పష్టంగా తెలుసుకొని, వారికి నచ్చిన సంస్థల గురించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. తమకు నచ్చిన వైద్య కళాశాలలను ఎంచుకున్న తర్వాత, అభ్యర్థులు వాటిని ఒక రోజు వ్యవధిలో తప్పనిసరిగా లాక్ చేయాలని గుర్తుంచుకోవాలి.

సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు ఎప్పుడు?

చాయిస్‌లు లాక్ చేసిన తర్వాత, సీట్ల కేటాయింపు ఫలితాలను కమిటీ తన వెబ్‌సైట్‌లో ప్రచురించడానికి సాధారణంగా రెండు రోజులు పడుతుంది. సీటు కేటాయింపుతో సంతృప్తి చెందిన అభ్యర్థులు, ప్రవేశం కోసం అవసరమైన పత్రాలతో కేటాయించిన కాలేజీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

నీట్ పీజీ 2025 కౌన్సెలింగ్: రాష్ట్రాల వారీగా టాప్ మెడికల్ కాలేజీలు

మీ ఎంపికలను ఖరారు చేసుకునే ముందు, దేశంలోని టాప్ ర్యాంకింగ్‌లో ఉన్న మెడికల్ కళాశాలల వివరాలు ఇక్కడ పరిశీలించండి..

దిల్లీలోని టాప్ మెడికల్ కాలేజీలు

  • ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), దిల్లీ - ర్యాంక్ 1
  • వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ అండ్ సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ - ర్యాంక్ 17
  • మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ - ర్యాంక్ 24
  • లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్ - ర్యాంక్ 29
  • యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ - ర్యాంక్ 32
  • ఇన్​స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ - ర్యాంక్ 34
  • హమ్‌దర్ద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (జామియా హమ్‌దర్ద్) - ర్యాంక్ 37

తమిళనాడులో ఉత్తమ మెడికల్ కాలేజీలు..

  • క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూరు - ర్యాంక్ 3
  • అమృత విశ్వ విద్యాపీఠం - ర్యాంక్ 8
  • మద్రాస్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, చెన్నై - ర్యాంక్ 10
  • సేవితా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, చెన్నై - ర్యాంక్ 12
  • ఎస్ఆర్‌ఎం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చెన్నై - ర్యాంక్ 18
  • శ్రీ రామచంద్ర ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చెన్నై - ర్యాంక్ 20
  • పీఎస్‌జీ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, కోయంబత్తూరు - ర్యాంక్ 41

కర్ణాటకలోని టాప్ 50 మెడికల్ కాలేజీలు

  • నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, బెంగళూరు - ర్యాంక్ 4
  • కస్తూరిబా మెడికల్ కాలేజ్, మణిపాల్ - ర్యాంక్ 9
  • సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్, బెంగళూరు - ర్యాంక్ 28
  • కస్తూరిబా మెడికల్ కాలేజ్, మంగళూరు - ర్యాంక్ 33
  • జేఎస్‌ఎస్ మెడికల్ కాలేజ్, మైసూర్ - ర్యాంక్ 39
  • ఎం.ఎస్. రామయ్య మెడికల్ కాలేజ్ - ర్యాంక్ 46

పంజాబ్‌ నుంచి టాప్ 50లో ఉన్న కాలేజీలు..

  • దయానంద్ మెడికల్ కాలేజ్, లుధియానా - ర్యాంక్ 40
  • క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, లుధియానా - ర్యాంక్ 49
  • మహారాష్ట్రలోని ప్రముఖ వైద్య సంస్థలు
  • డా. డి.వై. పాటిల్ విద్యాపీఠం, పూణే - ర్యాంక్ 11
  • దత్తా మేఘే ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, వార్ధా - ర్యాంక్ 23
  • ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్, పూణే - ర్యాంక్ 30

ఉత్తరప్రదేశ్‌లోని టాప్ మెడికల్ కాలేజీలు..

  • సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, లక్నో - ర్యాంక్ 6
  • బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి - ర్యాంక్ 7
  • కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, లక్నో - ర్యాంక్ 19
  • అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, అలీగఢ్ - ర్యాంక్ 27

టాప్ 50లో ఉన్న ఇతర రాష్ట్రాల కాలేజీలు..

ఒడిశా: ఎయిమ్స్ భువనేశ్వర్ (15), శిక్ష 'ఓ' అనుసంధాన్ (21), కేఐఐటీ భువనేశ్వర్ (25)

పుదుచ్చేరి: జిప్‌మెర్ (5), మహాత్మా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (47)

కేరళ: శ్రీ చిత్ర తిరునాల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (13), గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, తిరువనంతపురం (42)

హరియానా: మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీ, అంబాలా (35), పీటీ. బి.డి. శర్మ యూనివర్సిటీ, రోహ్‌తక్ (50)

ఛంఢీగఢ్: పీజీఐఎంఈఆర్ (2), గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (36)

పశ్చిమ బెంగాల్: ఐపీజీఎంఈఆర్, కోల్‌కతా (22), మెడికల్ కాలేజ్, కోల్‌కతా (44)

మధ్యప్రదేశ్: ఎయిమ్స్ భోపాల్ (31)

బిహార్: ఎయిమ్స్ పట్నా (26)

ఛత్తీస్‌గఢ్: ఎయిమ్స్ రాయ్‌పూర్ (38)

గుజరాత్: గుజరాత్ క్యాన్సర్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అహ్మదాబాద్ (45)

తెలంగాణ: ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్ (48)

రాజస్థాన్: ఎయిమ్స్ జోధ్‌పూర్ (16), సవాయి మాన్ సింగ్ మెడికల్ కాలేజ్, జైపూర్ (43)

ఉత్తరాఖండ్: ఎయిమ్స్ రిషికేష్ (14)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More